Home /News /technology /

REDMI 10A SMARTPHONE RELEASED UNDER RS 10000 IN INDIA KNOW SPECIFICATIONS SS

Redmi 10A: రెడ్‌మీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర, ఫీచర్స్ వివరాలివే

Redmi 10A: రెడ్‌మీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర, ఫీచర్స్ వివరాలివే
(image: Redmi India)

Redmi 10A: రెడ్‌మీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర, ఫీచర్స్ వివరాలివే (image: Redmi India)

Redmi 10A | ఇండియాలో రూ.10,000 లోపు బడ్జెట్‌లో రెడ్‌మీ 10ఏ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది షావోమీ ఇండియా. బేసిక్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ (Budget Smartphone) కొనాలనుకునేవారి కోసం ఈ స్మార్ట్‌ఫోన్ రూపొందించింది.

    షావోమీ ఇండియా రెడ్‌మీ 10 సిరీస్‌లో (Redmi 10 Series) మరో రెండు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. రెడ్‌మీ 10ఏ (Redmi 10A), రెడ్‌మీ 10 పవర్ (Redmi 10 Power) మోడల్స్‌ని పరిచయం చేసింది. ఇప్పటికే రెడ్‌మీ 10 సిరీస్‌లో రెడ్‌మీ 10, రెడ్‌మీ 10 ప్రైమ్ మోడల్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రెడ్‌మీ 10ఏ, రెడ్‌మీ 10 పవర్ వచ్చేశాయి. వీటిలో రెడ్‌మీ 10ఏ స్మార్ట్‌ఫోన్ రూ.10,000 లోపు బడ్జెట్‌లో (Smartphone Under Rs 10,000) రిలీజ్ కావడం విశేషం. ఇది ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్. ఇందులో 6.53 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

    రెడ్‌మీ 10ఏ ధర


    రెడ్‌మీ 10ఏ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499 కాగా, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499. ఇదే బడ్జెట్‌లో ఉన్న సాంసంగ్ గెలాక్సీ ఏ03, టెక్నో స్పార్క్ 8 ప్రో, రియల్‌మీ నార్జో 50ఐ లాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. రెడ్‌మీ 10ఏ సేల్ ఏప్రిల్ 26న ప్రారంభం అవుతుంది. బ్యాంక్ ఆఫర్ వివరాలు తెలియాల్సి ఉంది. చార్‌కోల్ బ్లాక్, సీ బ్లూ, స్లేట్ గ్రే కలర్స్‌లో కొనొచ్చు.

    Oppo F21 Pro 5G: ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ సేల్ ఈరోజే... ఆ కార్డు ఉన్నవారికి భారీ డిస్కౌంట్


    రెడ్‌మీ 10ఏ స్పెసిఫికేషన్స్


    రెడ్‌మీ 10ఏ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.53 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రెడ్‌మీ 9ఏ, రెడ్‌మీ 9ఐ, మోటో ఈ7 పవర్ లాంటి స్మార్ట్‌ఫోన్లలో ఉంది. రెడ్‌మీ 10ఏ స్మార్ట్‌ఫోన్‌లో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉండటం విశేషం. మైక్రోఎస్‌డీ కార్డ్ స్లాట్‌తో 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

    5G Smartphone Offer: తొలిసారి భారీ డిస్కౌంట్‌తో 5జీ స్మార్ట్‌ఫోన్... ధర రూ.10,000 లోపే

    రెడ్‌మీ 10ఏ స్మార్ట్‌ఫోన్‌లో 13మెగాపిక్సెల్ ఏఐ ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తూ 4జీ నెట్వర్క్, బ్లూటూత్ 5.0, టైప్ సీ పోర్ట్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Mobile News, Mobiles, Redmi, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు