రెడ్మీ 10 సిరీస్‌లో ఇండియాలో రెడ్మీ 10 (Redmi 10) స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంది. గతంలో రిలీజైన రియల్మీ 9ఐ (Realme 9i) మోడల్లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. దీంతో ఈ రెండు స్మార్ట్ఫోన్ల మధ్య పోటీ తప్పదు. అయితే రెడ్మీ 10 మొబైల్ రూ.10,000 బడ్జెట్లో లభిస్తే, రియల్మీ 9ఐ రూ.15,000 లోపు ధరలో రిలీజైంది. మరి ఈ రెండు స్మార్ట్ఫోన్లలో ఫీచర్స్ ఎలా ఉన్నాయి? వీటి మధ్య పోలికలేంటీ? తేడాలు ఏం ఉన్నాయి? మీ అవసరాలకు ఏది తీసుకోవచ్చు? తెలుసుకోండి.
స్పెసిఫికేషన్స్ | రెడ్మీ 10 | రియల్మీ 9ఐ |
డిస్ప్లే | 6.71 అంగుళాల హెచ్డీ డిస్ప్లే | 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే |
ర్యామ్ | 4జీబీ, 6జీబీ | 4జీబీ, 6జీబీ |
ఇంటర్నల్ స్టోరేజ్ | 64జీబీ, 128జీబీ | 64జీబీ, 128జీబీ |
ప్రాసెసర్ | క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 | క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 |
రియర్ కెమెరా | 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ | 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ |
ఫ్రంట్ కెమెరా | 5మెగాపిక్సెల్ | 16 మెగాపిక్సెల్ |
బ్యాటరీ | 6,000ఎంఏహెచ్ (10వాట్ ఛార్జింగ్) | 5,000ఎంఏహెచ్ (33వాట్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్) |
ఆపరేటింగ్ సిస్టమ్ | ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్ | ఆండ్రాయిడ్ 11 + రియల్మీ యూఐ 2.0 |
సిమ్ సపోర్ట్ | డ్యూయెల్ సిమ్ | డ్యూయెల్ సిమ్ |
కలర్స్ | క్యారిబ్బీన్ గ్రీన్, పసిఫిక్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ | ప్రిస్మ్ బ్లూ, ప్రిస్మ్ బ్లాక్ |
ధర | 4జీబీ+64జీబీ- రూ.10,9996జీబీ+128జీబీ- రూ.12,999 | 4జీబీ+64జీబీ- రూ.12,9996జీబీ+128జీబీ- రూ.14,499 |
OnePlus Nord CE 2 5G: తొలిసారి భారీ డిస్కౌంట్‌తో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2... ఆఫర్ పొందండి ఇలా
ఈ రెండు స్మార్ట్ఫోన్ల మధ్య తేడాలు చూస్తే రెడ్మీ 10 స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్, 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటే, రియల్మీ 9ఐ మోడల్లో 50మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కెమెరా విషయంలో రియల్మీ 9ఐ మొబైల్‌ది పైచేయి. రెడ్మీ 10 స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే, రియల్మీ 9ఐ మోడల్లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. బ్యాటరీ విషయంలో రెడ్మీ 10 స్మార్ట్‌ఫోన్‌ది పైచేయి. కానీ రియల్మీ 9ఐ స్మార్ట్‌ఫోన్‌కు 33వాట్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ధర విషయానికి వస్తే రెడ్మీ 10 ధర తక్కువగా ఉంది. రియల్మీ 9ఐ మోడల్లో ఫీచర్స్ కాస్త ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ధర కూడా ఎక్కువగానే ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile News, Mobiles, Realme, Redmi, Smartphone