హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Redmi 10: 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్‌మీ 10 వచ్చేసింది... ధర ఎంతంటే

Redmi 10: 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్‌మీ 10 వచ్చేసింది... ధర ఎంతంటే

Redmi 10: 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్‌మీ 10 వచ్చేసింది... ధర ఎంతంటే
(image: Redmi India)

Redmi 10: 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్‌మీ 10 వచ్చేసింది... ధర ఎంతంటే (image: Redmi India)

Redmi 10 | ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రూ.10,000 బడ్జెట్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది రెడ్‌మీ ఇండియా. రెడ్‌మీ 10 (Redmi 10) స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

షావోమీ ఇండియా భారతదేశంలో రెడ్‌మీ 10 సిరీస్‌లో (Redmi 10 Series) మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. రెడ్‌మీ 10 (Redmi 10) మోడల్‌ను పరిచయం చేసింది. ఇందులో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉండటం విశేషం. ఇదే ప్రాసెసర్ రెడ్‌మీ నోట్ 11, వివో వై33టీ, రియల్‌మీ 9ఐ మోడల్స్‌లో ఉండటం విశేషం. బడ్జెట్ సెగ్మెంట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.15,000 లోపు బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది రెడ్‌మీ ఇండియా. రెడ్‌మీ 10 ప్రారంభ ధర రూ.10,999. రెండు వేరియంట్లలో రెడ్‌మీ 10 రిలీజైంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్‌లో ఉన్న మోడల్స్‌కు రెడ్‌మీ 10 గట్టి పోటీ ఇవ్వనుంది.

రెడ్‌మీ 10 ధర

రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొంటే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.9,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.11,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. మార్చి 24న సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంఐ హోమ్, ఎంఐ స్టూడియో, Mi.com లో కొనొచ్చు.

iQOO Z6: తక్కువ ధరకే స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో స్మార్ట్‌ఫోన్... ఐకూ జెడ్6 వచ్చేసింది

రెడ్‌మీ 10 స్పెసిఫికేషన్స్

రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.71 హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇప్పటికే ఇండియాలో ఈ ప్రాసెసర్‌తో పలు మొబైల్స్ ఉన్నాయి. అయితే ఈ ప్రాసెసర్‌తో తక్కువ ధరకే రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ లభిస్తుండటం విశేషం. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో ర్యామ్ బూస్టర్ ఫీచర్ ఉంది. 2జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు.

Redmi Note 11 Pro+ 5G: రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ సేల్ ఈరోజే... ఆఫర్ వివరాలివే

రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో పోర్ట్‌రైట్ కెమెరా, మూవీ ఫ్రేమ్, కెలిడియోస్కోప్, స్లో మోషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో కూడా మూవీ ఫ్రేమ్, కెలిడియోస్కోప్, స్లో మోషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండటం విశేషం. 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆఫ్షన్స్ చూస్తే 4జీ ఎల్‌టీఈ, వైఫై, యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. క్యారిబ్బీన్ గ్రీన్, పసిఫిక్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.

First published:

Tags: Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు