Redmi 10 prime vs Redmi Note 10: ఈ రెండు రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

Redmi 10 prime vs Redmi Note 10: ఈ రెండు రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి (image: Redmi India)

Redmi 10 prime vs Redmi Note 10 | మీరు రూ.15,000 లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? రెడ్‌మీ 10 ప్రైమ్, రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్ల మధ్య ఉన్న తేడాలు తెలుసుకోండి.

  • Share this:
    షావోమీ ఇటీవల రెడ్‌మీ 10 సిరీస్‌లో (Redmi 10 Series) మొదటి స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రెడ్‌మీ 10 ప్రైమ్ (Redmi 10 Prime) మోడల్‌ను పరిచయం చేసింది. గతేడాది బాగా పాపులర్ అయిన రెడ్‌మీ 9 ప్రైమ్ (Redmi 9 Prime) అప్‌గ్రేడెడ్ వర్షన్ రెడ్‌మీ 10 ప్రైమ్ (Redmi 10 Prime) అందుబాటులోకి వచ్చింది. ఇక ఇప్పటికే రెడ్‌మీ నోట్ 10 సీరీస్‌లో (Redmi Note 10 Series) తక్కువ ధరలో రెడ్‌మీ నోట్ 10 (Redmi Note 10) అందుబాటులో ఉంది. రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్ ధర రెడ్‌మీ 10 ప్రైమ్ ధర కన్నా కాస్త ఎక్కువ. మరి ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఉన్న తేడాలేంటీ? పోలికలేంటీ? ఈ రెండు రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి.

    డిస్‌ప్లే: రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌లో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే ఉండటం విశేషం. డిస్‌ప్లే విషయంలో రెడ్‌మీ నోట్ 10 మోడల్‌ది పైచేయి.

    Mi 11x 5G: ఎస్‌బీఐ కార్డు ఉందా? రూ.27,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.5,399 ధరకే కొనండి ఇలా

    ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్: రెడ్‌మీ 10 ప్రైమ్, రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్లలో 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి.

    ప్రాసెసర్: రెడ్‌మీ 10 ప్రైమ్ మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 678 ప్రాసెసర్ ఉంది. ప్రాసెసర్ విషయంలో రెడ్‌మీ నోట్ 10 పెర్ఫామెన్స్ బాగుంటుంది.

    రియర్ కెమెరా: రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ Sony IMX58 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌లో Sony IMX58 సెన్సార్ ఉండటం ప్లస్ పాయింట్.

    Airtel New Plans: ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్... కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ వచ్చేశాయి

    ఫ్రంట్ కెమెరా: రెడ్‌మీ 10 ప్రైమ్ మొబైల్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండగా, రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సెల్ఫీ కెమెరా విషయంలోనూ రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌ది పైచేయి.

    బ్యాటరీ: రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌లో 6000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 9వాట్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. భారీ బ్యాటరీ కావాలనుకుంటే 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న రెడ్‌మీ 10 ప్రైమ్ ఎంచుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే రెడ్‌మీ నోట్ 10 బెస్ట్ ఆప్షన్.

    Smartphone Tips: కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నారా? ఫోన్ నెంబర్స్ ఇలా ట్రాన్స్‌ఫర్ చేయండి

    ఆపరేటింగ్ సిస్టమ్: రెడ్‌మీ 10 ప్రైమ్ ఎంఐయూఐ 12.5 + ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తే, రెడ్‌మీ నోట్ 10 ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

    కలర్స్: రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ ఆస్ట్రాల్ వైట్, బైఫ్రోస్ట్ బ్లూ, ఫాంటమ్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. రెడ్‌మీ నోట్ 10 ఆక్వా గ్రీన్, షాడో బ్లాక్, ఫ్రాస్ట్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది.

    ధర: రెడ్‌మీ 10 ప్రైమ్ 4జీబీ ర్యామ్ + 64జీబీ వేరియంట్ ధర రూ.12,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ ధర రూ.14,499. ఇక రెడ్‌మీ 10 ప్రైమ్ 4జీబీ ర్యామ్ + 64జీబీ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ ధర రూ.15,499. సేల్ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్లు ఇంకా తక్కువ ధరకు రావొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: