Redmi 10 Prime: భారీ బ్యాటరీతో రెడ్‌మీ 10 ప్రైమ్ వచ్చేసింది... ధర ఎంతంటే

Redmi 10 Prime: భారీ బ్యాటరీతో రెడ్‌మీ 10 ప్రైమ్ వచ్చేసింది... ధర ఎంతంటే (image: Redmi India)

Redmi 10 Prime | రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్ (Smartphone under Rs 15,000) కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రెడ్‌మీ 10 ప్రైమ్ (Redmi 10 Prime) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
    షావోమీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ అయింది. రెడ్‌మీ 10 ప్రైమ్ (Redmi 10 Prime) లాంఛ్ చేసింది. గతేడాది రిలీజ్ అయిన రెడ్‌మీ 9 ప్రైమ్ (Redmi 9 Prime) అప్‌గ్రేడెడ్ వేరియంట్ ఇది. గతేడాది రెడ్‌మీ 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ బాగా పాపులర్ అయింది. రెడ్‌మీ 9 సిరీస్‌లో వచ్చిన స్మార్ట్‌ఫోన్లు అన్నింటిలో రెడ్‌మీ 9 ప్రైమ్ మోడల్‌కు క్రేజ్ ఎక్కువ లభించింది. దీంతో షావోమీ రెడ్‌మీ 10 ప్రైమ్ రిలీజ్ చేస్తుందని వార్తలు వచ్చినప్పటి నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌పై అంచనాలు పెరిగాయి. రెడ్‌మీ 9 ప్రైమ్ లాగానే రెడ్‌మీ 10 ప్రైమ్ అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తుందా అని షావోమీ ఫ్యాన్స్ ఎదురుచూశారు. షావోమీ అధికారికంగా రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది.

    ధర ఎంత?


    రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్, 6000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 50మెగాపిక్సెల్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. రెడ్‌మీ 10 ప్రైమ్ ప్రారంభ ధర రూ.12,499. ఇది 4జీబీ ర్యామ్ + 64జీబీ వేరియంట్ ధర. ఇక 6జీబీ ర్యామ్ + 128జీబీ ధర రూ.14,499. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది. సెప్టెంబర్ 7న సేల్ ప్రారంభం అవుతుంది. అమెజాన్ ఇండియా, షావోమీ అధికారిక వెబ్‌సైట్లతో పాటు ఆఫ్‌లైన్ రీటైలర్ల దగ్గర రెడ్‌మీ 10 ప్రైమ్ కొనొచ్చు.

    Mi 11 Lite: రూ.21,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.3,999 ధరకే... ఆఫర్ వివరాలు తెలుసుకోండి


    ఫీచర్స్ ఏంటీ?


    రెడ్‌మీ 10 ప్రైమ్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. 4జీబీ+64జీబీ వేరియంట్‌లో మైక్రోఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. 6జీబీ+128జీబీ వేరియంట్‌లో మైక్రోఎస్‌డీ కార్డుతో 2టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

    Realme X7 Max 5G: మీ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.3,000 ఎక్స్‌ట్రా డిస్కౌంట్... రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ కొనేవారికి ఆఫర్

    కెమెరా వివరాలు


    రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండటం విశేషం. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 9వాట్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్సులో 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. రెడ్‌మీ 10 ప్రైమ్ ఎంఐయూఐ 12.5 + ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఆస్ట్రాల్ వైట్, బైఫ్రోస్ట్ బ్లూ, ఫాంటమ్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.

    రెడ్‌మీ ఇయర్‌బడ్స్ 3 ప్రో


    రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు టీడబ్ల్యూఎస్ రెడ్‌మీ ఇయర్‌బడ్స్ 3 ప్రో పరిచయం చేసింది. ధర రూ.2,999. సెప్టెంబర్ 9న సేల్ మొదలవుతుంది. 30 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ, IPX4 రేటింగ్, క్వాల్కమ్ క్యూసీసీ 3040 చిప్‌సెట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇయర్ బడ్ బరువు 4.6 గ్రాములు.
    Published by:Santhosh Kumar S
    First published: