Home /News /technology /

REDMI 10 POWER SMARTPHONE LAUNCHED IN INDIA WITH SNAPDRAGON 680 PROCESSOR KNOW PRICE AND SPECIFICATIONS SS

Redmi 10 Power: 50MP కెమెరా, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ... రెడ్‌మీ నుంచి మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్

Redmi 10 Power: 50MP కెమెరా, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ... రెడ్‌మీ నుంచి మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్
(image: Redmi India)

Redmi 10 Power: 50MP కెమెరా, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ... రెడ్‌మీ నుంచి మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ (image: Redmi India)

Redmi 10 Power | గతంలో బాగా పాపులర్ అయిన రెడ్‌మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ వర్షన్ రెడ్‌మీ 10 పవర్ (Redmi 10 Power) ఇండియాలో రిలీజైంది. ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

    బడ్జెట్ సెగ్మెంట్‌లో షావోమీ ఇండియా గతంలో రిలీజ్ చేసిన రెడ్‌మీ 9 పవర్ (Redmi 9 Power) స్మార్ట్‌ఫోన్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెడ్‌మీ 9 పవర్ అప్‌గ్రేడ్ వేరియంట్ రెడ్‌మీ 10 పవర్ (Redmi 10 Power) మొబైల్ ఇండియాలో రిలీజైంది. రెడ్‌మీ 10ఏ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రెడ్‌మీ 10 పవర్ మోడల్‌ను పరిచయం చేసింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్నాయి. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50MP కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.15,000 లోపు బడ్జెట్‌లో రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకోండి.

    రెడ్‌మీ 10 పవర్ ధర


    రెడ్‌మీ 10 పవర్ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే వేరియంట్లో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 మాత్రమే. ఇదే బడ్జెట్‌లో ఉన్న ఒప్పో కే10, రియల్‌మీ 9ఐ, పోకో ఎం4 ప్రో 5జీ లాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. రెడ్‌మీ 10 పవర్ సేల్ ఎప్పుడు ఉంటుందో కంపెనీ వెల్లడించలేదు. అమెజాన్, షావోమీ అధికారిక వెబ్‌సైట్, ఎంఐ హోమ్, రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. పవర్ బ్లాక్, స్పోర్టీ ఆరెంజ్ కలర్స్‌లో కొనొచ్చు.

    Redmi 10A: రెడ్‌మీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర, ఫీచర్స్ వివరాలివే


    రెడ్‌మీ 10 పవర్ స్పెసిఫికేషన్స్


    రెడ్‌మీ 10 పవర్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రియల్‌మీ 9 4జీ, ఒప్పో కే10, రెడ్‌మీ 10, రెడ్‌మీ నోట్ 11, వివో వై33టీ, రియల్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్లలో ఉంది. రెడ్‌మీ 10 పవర్ కేవలం 8జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే రిలీజైంది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో 11జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఎస్‌డీ కార్డ్ స్లాట్‌తో 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

    Oppo F21 Pro 5G: ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ సేల్ ఈరోజే... ఆ కార్డు ఉన్నవారికి భారీ డిస్కౌంట్

    రెడ్‌మీ 10 పవర్ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ పోర్ట్‌రైట్ సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్సులో కేవలం 10వాట్ ఛార్జింగ్ అడాప్టర్ మాత్రమే లభిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే డ్యూయెల్ సిమ్ + ఎస్‌డీ కార్డ్ స్లాట్, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5 లాంటి ఆప్షన్స్ ఉన్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Mobile News, Mobiles, Redmi, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు