మొబైల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ రెడ్‌మీ నుంచి తాజాగా కొత్త 5G ఫోన్ లాంచ్ అయింది. థాయిలాండ్, ఇండోనేషియా మార్కెట్లలో రెడ్‌మీ 10 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఎంట్రీ-లెవల్ 5G ఫోన్ 200 డాలర్ల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది. టాల్ యాస్పెక్ట్ రేషియో, వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, డైమెన్సిటీ 7-సిరీస్ చిప్, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాలు, బిగ్ బ్యాటరీ వంటి బెస్ట్ ఫీచర్‌లను రెడ్‌మీ 10 5G స్మార్ట్‌ఫోన్ అందిస్తోంది.
* Redmi 10 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
రెడ్‌మీ 10 5G స్మార్ట్‌ఫోన్ 6.58-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను అందిస్తుంది. ఈ ఫోన్ 1080 x 2048 పిక్సెల్స్ ఫుల్ HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. డివైజ్ ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్‌లో f/1.8 ఎపర్చరు, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, LED ఫ్లాష్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందిస్తున్నారు. డైమెన్సిటీ 700 చిప్, LPDDR4x RAM, UFS 2.2 స్టోరేజ్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది.
రెడ్‌మీ 10 5G స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్, 4 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్, 6 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి మల్టిపుల్ వేరియంట్‌లలో లభిస్తోంది. హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై MIUI 13తో రన్ అవుతుంది. డివైజ్‌లో 18W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ ఉంటుంది. దీని రిటైల్ ప్యాకేజీలో 22.5W ఛార్జర్‌ను కంపెనీ అందిస్తోంది. ఫోన్ సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, AI ఫేస్ అన్‌లాక్ వంటి సెక్యూరిటీ ఫీచర్‌లు అందుబాటులో ఉన్నాయి.
రెడ్‌మీ 10 5G స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.1, NFC, GPS, USB-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ వంటి ఇతర ఫీచర్లను అందిస్తుంది. ఫోన్ మెజర్‌మెంట్స్ 163.99 x 76.09 x 8.9mm, బరువు 200 గ్రాములుగా ఉన్నాయి. ఈ ఫోన్ రెడ్‌మీ నోట్ 11e రీబ్రాండెడ్ వెర్షన్, ఇది మార్చిలో చైనాలో అధికారికంగా లాంచ్ అయింది.
* Redmi 10 5G ధర, లభ్యత
రెడ్‌మీ 10 5G ఫోన్ 4 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర 180 డాలర్లు కాగా, 6 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర 194 డాలర్లుగా ఉంది. హ్యాండ్‌సెట్ అరోరా గ్రీన్, క్రోమ్ సిల్వర్, గ్రాఫైట్ గ్రే వంటి మూడు కలర్స్‌లో అందుబాటులో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g smart phone, Budget smart phone, Redmi, Xiomi