హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

వచ్చే ఏడాది మార్కెట్​లోకి Redmi 10 (2022) స్మార్ట్​ఫోన్.. 50 ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్లు.. ఓ లుక్కేయండి

వచ్చే ఏడాది మార్కెట్​లోకి Redmi 10 (2022) స్మార్ట్​ఫోన్.. 50 ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్లు.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రెడ్​మీ 10 (2022) ఈ సంవత్సరం ఆగస్టులో ప్రారంభమైన రెడ్​మీ 1‌0((Redmi 10)) కు కొనసాగింపుగా వస్తోంది. ఈ కొత్త ఫోన్​లో (Smartphone) దాదాపు రెడ్​మీ 10లోని ఫీచర్లనే అందిచనుంది. అయితే డిజైన్​, లుక్​ పరంగా కొన్ని అప్​డేట్స్​ను చేర్చే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...

ప్రముఖ చైనీస్​ స్మార్ట్​ బ్రాండ్​ ​రెడ్​మీ(Redmi) నుంచి త్వరలోనే మరో కొత్త ఫోన్​ లాంచ్​ కానుంది. ఇప్పటికే రెడ్​మీ 10 (Redmi 10) సిరీస్​లో బడ్జెట్​ ఫోన్లు విడుదలవ్వగా వాటికి మంచి రెస్పాన్స్​ వచ్చింది. ఇప్పుడు ఇదే సిరీస్​లో రెడ్​మీ10 (2022) ఫోన్​ను లాంచ్​ చేసేందుకు షియోమి సిద్ధమవుతోంది. అయితే షియోమి (xiaomi) నుంచి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. యురేషియన్ ఎకనామిక్ కమిషన్ (EEC) సర్టిఫికేషన్ లిస్ట్​లో రెడ్​మీ 10 (2‌022) కనిపించింది. ఈ స్మార్ట్​ఫోన్ (Smartphone) ఐఎండీఏ, టీకేడీఎన్​, ఎడీపీపీఐ, టీయూవీ రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ సైట్లతో సహా పలు వెబ్‌సైట్లలో కనిపించింది. వచ్చే ఏడాది భారత మార్కెట్​లోకి (Indian Market) రెడ్​మీ 10 (2020) రాకను ఇవి ధ్రువీకరించాయి. కాగా, ఈ హ్యాండ్‌సెట్​ను గతంలో IMEI డేటాబేస్‌లో కూడా చేర్చింది.

రాబోయే రెడ్​మీ 10 (2022) ఈ సంవత్సరం ఆగస్టులో ప్రారంభమైన రెడ్​మీ 1‌0 కు కొనసాగింపుగా వస్తోంది. ఈ కొత్త ఫోన్​లో దాదాపు రెడ్​మీ 10లోని ఫీచర్లనే అందిచనుంది. అయితే డిజైన్​, లుక్​ పరంగా కొన్ని అప్​డేట్స్​ను చేర్చే అవకాశం ఉంది. ఎస్​డీపీపీఐ, టీకేడీఎన్​ సర్టిఫికేషన్ సైట్లలో మోడల్ నంబర్ 21121119SGతో ఈ ఫోన్ కనిపించిందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ (@yabhishekhd) ట్వీట్ చేశారు. ఈ హ్యాండ్‌సెట్ తొలుత ఇండోనేషియా మార్కెట్​లోకి రానుంది.

మరోవైపు, టిప్‌స్టర్ Kacper Skrzypek (@kacskrz) కూడా రెడ్​మీ10 (2022కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లను తన ట్వీట్ ద్వారా పంచుకున్నారు. టిప్‌స్టర్ ప్రకారం, హ్యాండ్‌సెట్ వెనుక భాగంలో 50 -మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 8- మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలను అందించనుంది. రాబోయే రెడ్‌మి 10 (2022) లోని ఫీచర్లుఈ ఏడాది విడుదలైన రెడ్‌మీ 10 మాదిరిగానే ఉంటాయని టిప్‌స్టర్ పేర్కొన్నారు. ఈ స్మార్ట్​ఫోన్​ 21121119SG, 22011119UY IMEI మోడల్ నంబర్లతో విడుదల కానుంది.

OnePlus 10 Pro: రిలీజ్​కు ముందే లీకైన వన్​ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు... కొత్త డిజైన్​, కళ్లు చెదిరే ఫీచర్లు

రెడ్​మీ 10 ఫీచర్లతోనే రెడ్​మీ 10 (2022)

రెడ్​మీ 10 (2021) వేరియంట్ ఈ ఏడాది ఆగస్టులో విడుదలైన సంగతి తెలిసిందే. ఇది మొత్తం మూడు ర్యామ్​, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 -అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ అడాప్టివ్​ సింక్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్​ హీలియో G88 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 6 జీబీ ర్యామ్​, 128 జీబీ ఆన్‌బోర్డ్ నిల్వతో వస్తుంది.

Vivo V23e 5G: వివో వి23ఈ 5జీ స్మార్ట్​ఫోన్​ లాంచ్.. అద్భుతమైన ఫీచర్లతో మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్

కెమెరా పరంగా చూస్తే.. రెడ్​మీ 10 వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌ను అందించింది. దీనిలో 50 -మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 -మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 2 -మెగాపిక్సెల్ సెన్సార్​ కెమెరాలను అందించింది. సెల్ఫీలు, వీడియో కాలింగ్​ కోసం దీనిలో ప్రత్యేకంగా 8 -మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాను చేర్చింది. ఈ స్మార్ట్​ఫోన్​ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ గల 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

First published:

Tags: 5G Smartphone, Redmi, Smartphone, Xiomi

ఉత్తమ కథలు