• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • REALME X7 PRO EXTREME EDITION WITH 90HZ AMOLED DISPLAY LAUNCHED HERE PRICE AND SPECIFICATIONS DETAILS NS GH

Realme X7 Pro Extreme Edition: అదిరిపోయే ఫీచర్లతో రియల్​మీ X7 ప్రో ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్.. భారత మార్కెట్​లోకి ఎప్పుడంటే?

Realme X7 Pro Extreme Edition: అదిరిపోయే ఫీచర్లతో రియల్​మీ X7 ప్రో ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్.. భారత మార్కెట్​లోకి ఎప్పుడంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్​మీ ఫిబ్రవరిలో తన X7 సిరీస్​లో 5జీ ఆధారిత ఫోన్లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో.. ఇప్పుడు ఇవే ఫోన్లకు అడ్వాన్స్డ్​ ఫీచర్లను చేర్చి ఎక్స్​ట్రీమ్​ ఎడిషన్లను లాంఛ్​ చేస్తోంది రియల్ మీ. ఆ ఫోన్ల స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ రియల్​మీ బ్రాండ్​ భారత మార్కెట్​లో దూసుకుపోతోంది. బడ్డెట్ ధరలోనే ప్రీమియం ఫీచర్లతో స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తూ మొబైల్​ ప్రియులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం 4జీ నుండి 5జీకి మారుతున్న క్రమంలో అన్ని మొబైల్​ తయారీ సంస్థలు పోటాపోటీగా 5జీ ఫోన్లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి నెలలో రియల్​మీ తన X7 సిరీస్​లో 5జీ ఆధారిత ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్లకు భారత మార్కెట్​లో అద్భుతమైన రెస్పాన్స్​ వచ్చింది. దీంతో, ఇప్పుడు ఇవే ఫోన్లకు అడ్వాన్స్డ్​ ఫీచర్లను చేర్చి ఎక్స్​ట్రీమ్​ ఎడిషన్లను లాంఛ్​ చేస్తుంది. అయితే, ఈ ఎడిషన్లను ముందుగా చైనా మార్కెట్​లో అందుబాటులోకి తెస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చైనా మార్కెట్​లో ఎక్స్​7 ప్రో ఎక్స్​ట్రీమ్​ ఎడిషన్​ను ఆవిష్కరించింది. ఇది రియల్​మీ ఎక్స్ 7 లైనప్‌ నుంచి వస్తోన్న మూడో ఫోన్. ఇందులో ఇప్పటికే రియల్‌మీ ఎక్స్ 7, రియల్‌మీ ఎక్స్ 7 ప్రో వంటి స్మార్ట్​ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లను ఫిబ్రవరిలోనే మిడ్ రేంజ్ ఫోన్‌లుగా కంపెనీ లాంచ్ చేసింది. ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ న్యూ డిజైన్, కలర్ ఆప్షన్స్, హై రిఫ్రెష్ రేట్, AMOLED డిస్​ప్లే, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

కాగా.. చైనాలో విడుదలైన రియల్​మీ X7 ప్రో ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్లు మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తాయి. 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్​తో కూడిన దీని బేస్ వేరియంట్ CNY 2,299 (భారత కరెన్సీలో సుమారు రూ. 25,600) వద్ద లభిస్తుండగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ CNY 2,599 (భారత కరెన్సీలో సుమారు రూ .29,000)లకు మాత్రమే లభిస్తుంది. ఈ రెండు వేరియంట్లు రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.

రియల్ మీ ఎక్స్ 7 ప్రో ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్
రియల్‌మీ ఎక్స్‌ 7 ప్రో ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ ఫీచర్లు కూడా 7 ప్రో ఫీచర్ల మాదిరిగానే ఉంటాయి. అయితే, X7 ప్రో మోడల్​తో పోలిస్తే దీని హార్డ్‌వేర్, డిజైన్​లో అనేక మార్పులు చేసింది. ఈ ఫోన్​లో కర్వ్ డ్​ ఎడ్జెస్​తో కూడిన 6.55 -అంగుళాల FHD + AMOLED డిస్​ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్​నెస్​, 360Hz టచ్ శాంప్లింగ్ రేటుతో వస్తుంది. 32 -మెగాపిక్సెల్ సెన్సార్​తో కూడిన ఇన్-డిస్​ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, పంచ్​ హోల్- కటౌట్​ను కూడా దీనిలో చేర్చారు.

ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1000 ప్లస్​ 5 జీ చిప్‌సెట్​ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇక, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ ఆప్షన్​తో కూడిన ఈ స్మార్ట్​ఫోన్​లో ట్రిపుల్​ రియర్​ కెమెరా సెటప్​ను అందించింది. ఇందులో, 64 మెగాపిక్సెల్​తో కూడిన ప్రైమరీ సెన్సార్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యూనిట్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్​ కెమెరా వంటి వాటిని చేర్చింది. బ్యాటరీ విషయానికి వస్తే.. దీనిలో 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్​తో వస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ ఆండ్రాయిడ్ 11 బేస్డ్​ రియల్​మీ యుఐ 2.0తో పనిచేస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు