Best 5G Smartphones: 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలా? రూ.25,000 లోపు బెస్ట్​ మోడల్స్ ఇవే

Best 5G Smartphones: 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలా? రూ.25,000 లోపు బెస్ట్​ మోడల్స్ ఇవే

Best 5G Smartphones | మీరు 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.25,000 లోపా? ఈ బడ్జెట్‌లో బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్స్ గురించి తెలుసుకోండి.

  • Share this:
భారతదేశంలో 5G కనెక్టివిటీ ఇంకా అందుబాటులోకి రానప్పటికీ, అన్ని ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థలు పోటీపోటీగా 5జీ స్మార్ట్​ఫోన్లను లాంచ్​​ చేస్తున్నాయి. కేవలం రూ. 25 వేల బడ్జెట్​లోపే అద్భుతమైన ఫీచర్లతో వీటిని రిలీజ్​ చేస్తున్నాయి. షియోమి, వన్​ప్లస్, శామ్​సంగ్​​ వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి విడుదలైన రూ. 25 వేలలోపు 5జీ స్మార్ట్​ఫోన్లు పరిశీలిద్దాం.

OnePlus Nord CE 5G


వన్​ప్లస్​ నార్డ్ లైనప్​లో విడుదలైన నార్డ్​ సీఈ 5జి 'కోర్ ఎడిషన్' రూ. 24,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇది 6.43 అంగుళాల ఫుల్-హెచ్‌డి+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 750G చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీని వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్​ను అందించింది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 4WmAh బ్యాటరీతో వస్తుంది.

Flipkart: డబ్బులు లేకపోయినా రూ.70,000 వరకు షాపింగ్ చేయొచ్చు... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

iQoo Z3 5G


కేవలం రూ. 20 వేలలోపు అద్భుతమైన ఫీచర్లు గల 5జీ స్మార్ట్​ఫోన్ కోసం చూస్తున్నట్లైతే ఐక్యూ జెడ్​3 5జీ బెస్ట్​ ఆప్షన్​. ఇది రూ. 19,990 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఐక్యూ Z3 5G 6.58- అంగుళాల ఫుల్-హెచ్‌డి+ ఎల్‌సిడి డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 768 జి సోసిని ఇంటిగ్రేటెడ్ అడ్రినో 620 జిపియు ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారిత ఆరిజినోస్ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌ ఓఎస్​తో నడుస్తుంది. ఇది డ్యుయల్ 5G సిమ్ కార్డుకు మద్దతిస్తుంది. దీని ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది.

Realme GT Master Edition: రూ.25,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.8,999 ధరకే... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

Xiaomi Mi 10i 5G


షియోమి ఎంఐ 10i 5G కేవలం రూ. 21,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 6.67 అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్​తో వస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 4,820 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

Aadhaar Card: మీ పేరుతో ఎవరైనా సిమ్ కార్డ్ తీసుకున్నారా? ఇలా చెక్ చేయండి

Samsung Galaxy M32 5G


సాంసంగ్​ గెలాక్సీ M32 5G ఈ నెల ప్రారంభంలోనే భారత మార్కెట్​లోకి లాంచ్​ అయ్యింది. ఇది రూ. 20,999 ధర వద్ద అందుబాటులోకి వచ్చింది. ఇది 6.5 అంగుళాల HD+ TFT ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 8GB ర్యామ్​తో జతచేసిన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీని క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్​ను చేర్చింది. 15W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,000mAh బ్యాటరీని అందించింది.

Realme X7 Max 5G


రియల్‌మి ఎక్స్ 7 మాక్స్ 5 జి కేవలం రూ. 23,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇందులో 6.43 -అంగుళాల ఫుల్-హెచ్‌డి+ sAMOLED డిస్‌ప్లేతో వస్తుంది. దీని వెనుకవైపు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1200 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ గల 4,500mAh బ్యాటరీతో వస్తుంది.
Published by:Santhosh Kumar S
First published: