Home /News /technology /

REALME X7 MAX 5G AND REALME GT USERS CAN NOW TRY OUT REALME UI 3 0 BASED ON ANDROID 12 HERE DETAILS NS GH

Realme UI 3.0: రియల్ మీ X7 మ్యాక్స్ 5G యూజర్లకు UI 3.0 అప్‌డేట్.. ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రాం ప్రారంభించిన సంస్థ

రియల్ మీ X7 మ్యాక్స్ 5G యూజర్లకు UI 3.0 అప్‌డేట్.. ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రాం ప్రారంభం

రియల్ మీ X7 మ్యాక్స్ 5G యూజర్లకు UI 3.0 అప్‌డేట్.. ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రాం ప్రారంభం

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ, సరికొత్త యూజర్ ఇంటర్‌ఫేజ్‌పై పనిచేస్తోంది. సంస్థ అభివృద్ధి చేసిన ఆండ్రాయిడ్ 12 ఆధారిత అప్‌డేట్ అయిన ‘Realme UI 3.0’ను అక్టోబర్‌లోనే విడుదల చేసింది.

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ(Realme), సరికొత్త యూజర్ ఇంటర్‌ఫేజ్‌పై పనిచేస్తోంది. సంస్థ అభివృద్ధి చేసిన ఆండ్రాయిడ్ 12 ఆధారిత అప్‌డేట్ అయిన ‘Realme UI 3.0’ను అక్టోబర్‌లోనే విడుదల చేసింది. దీని బీటా వెర్షన్‌ లాంచ్ అయిన తర్వాత రియల్‌మీ GT, GT మాస్టర్ ఎక్స్‌ప్లోరర్ వంటి హై-ఎండ్ డివైజ్‌లో ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు రియల్‌మీ X7 మ్యాక్స్ 5G (Realme X7 Max 5G) డివైజ్‌లకు కూడా రియల్‌మీ యూఐ 3.0ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సరికొత్త అప్‌డేట్‌ను టెస్టింగ్ చేయాలని డివైజ్ యూజర్లను సంస్థ కోరుతోంది. ఇందుకోసం ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్​ను నిర్వహించనుంది. ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్​కు సంబంధించిన వివరాలను రియల్‌మీ సంస్థ షేర్ చేసింది. ఆసక్తి ఉన్నవారు ఈ ప్రోగ్రామ్​కు సైనప్ అవ్వడం ద్వారా సాఫ్ట్​వేర్​ను ఉపయోగించవచ్చు. ఎర్లీ యాక్సెస్ వెర్షన్ కోసం అప్లై చేయడానికి మీ ఫోన్‌ RMX3031_11.A.21 సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుండాలి.

ఈ విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం కుడివైపు పైభాగంలో కనిపించే సెట్టింగ్స్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆప్షన్ల నుంచి ట్రయల్ వెర్షన్‌ను ఎంచుకోండి. తర్వాత మీ వివరాలను నింపి, “Apply Now” బటన్‌ను నొక్కండి. మీ అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత, డివైజ్‌లో Realme UI 3.0 ప్రీ-రిలీజ్ అప్‌డేట్‌ అందుబాటులోకి వస్తుంది.
Smartphones with wireless charger: వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే.. ఈ పది ఫోన్లపై ఓ లుక్కేయండి

కొత్త అప్‌డేట్‌తో సరికొత్త ఫీచర్లు
ఈ ఆండ్రాయిడ్ బేస్డ్ Realme UI 3.0 ఇంటర్‌ఫేజ్ అనేక కొత్త ఫీచర్లను యూజర్లకు అందిస్తుంది. డార్క్ మోడ్, వాల్​పేపర్ బేస్డ్ థీమింగ్ ఇంజిన్, కస్టమ్​ ఫేస్ ఎమోజీ సపోర్ల్.. వంటి ఫీచర్లు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్​కు అప్లై చేసుకునే ముందే డేటా బ్యాకప్ చేసుకోవడం మంచిది. డివైజ్‌ అప్‌డేట్ అయిన తర్వాత ఏవైనా బగ్స్ కనిపిస్తే.. వాటి గురించి కంపెనీకి ఫిర్యాదు చేయాలి. అధికారిక ఫీడ్‌బ్యాక్ ఫారం, బగ్ రిపోర్టింగ్ లాగ్‌కిట్ ఉపయోగించి వీటి గురించి నేరుగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ బృందానికి నివేదించవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Realme, Realme UI, Xiomi

తదుపరి వార్తలు