హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme X7 5G: రిలీజ్‌కు ముందే లీకైన ధరలు... రియల్‌మీ ఎక్స్7 5జీ ప్రైస్ ఇదే

Realme X7 5G: రిలీజ్‌కు ముందే లీకైన ధరలు... రియల్‌మీ ఎక్స్7 5జీ ప్రైస్ ఇదే

Realme X7 5G | రియల్‌మీ ఎక్స్7 5జీ స్మార్ట్‌ఫోన్ ధర లీకైంది. 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ రిలీజ్ కానుంది. మరి ధర ఎంతో తెలుసుకోండి.

Realme X7 5G | రియల్‌మీ ఎక్స్7 5జీ స్మార్ట్‌ఫోన్ ధర లీకైంది. 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ రిలీజ్ కానుంది. మరి ధర ఎంతో తెలుసుకోండి.

Realme X7 5G | రియల్‌మీ ఎక్స్7 5జీ స్మార్ట్‌ఫోన్ ధర లీకైంది. 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ రిలీజ్ కానుంది. మరి ధర ఎంతో తెలుసుకోండి.

  రియల్‌మీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న Realme X7 5G, Realme X7 Pro 5G స్మార్ట్‌ఫోన్లు ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 12.30 గంటలకు రిలీజ్ కానుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్లు చైనాలో రిలీజ్ అయ్యాయి కాబట్టి స్పెసిఫికేషన్స్ తెలుసు. చైనాలో ధరల విషయానికి వస్తే రియల్‌మీ ఎక్స్7 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర 1,799 యువాన్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.20,400. ఇక 8జీబీ+128జీబీ వేరియంట్ ధర 2,399 యువాన్లు. అంటే రూ.27,200. ఇండియాలో ధరలు దాదాపు ఇంతే ఉంటాయని అంచనా వేస్తున్నారు. కానీ రిలీజ్‌కు ముందే రియల్‌మీ ఎక్స్7 స్మార్ట్‌ఫోన్ ధరలు లీక్ అయ్యాయి. ట్విట్టర్‌లో @Gadgetsdata యూజర్‌నేమ్‌తో ఉన్న ఓ టిప్‌స్టర్ రియల్‌మీ ఎక్స్7 ధరను లీక్ చేయడం వైరల్‌గా మారింది.

  ఇండియాలో రియల్‌మీ ఎక్స్7 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999 ఉంటుందని, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,999 ఉంటుందని ట్వీట్ చేశాడు. ఒకవేళ ఇందులోని ధరలే నిజమైతే రియల్‌మీ ఎక్స్7 ఇప్పటికే ఇండియన్ మార్కెట్‌లో ఉన్న వన్‌ప్లస్ నార్డ్, ఎంఐ10ఐ 5జీ స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇస్తుంది. ఇక రియల్‌మీ ఎక్స్7 ప్రో ధరలు ఎలా ఉంటాయో తెలియదు.

  Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో మరో సేల్... రూ.30,000 లోపు బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవే

  FAU-G: రికార్డులు బద్దలుగొడుతున్న ఫౌజీ గేమ్... ప్లేస్టోర్‌లో టాప్ గేమ్

  ఫిబ్రవరి 4న రియల్‌మీ ఎక్స్7 5జీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్‌మీ ఎక్స్7 ప్రో 5జీ మోడల్ కూడా రిలీజ్ కానుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల కోసం రియల్‌మీ ఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండూ 5జీ స్మార్ట్‌ఫోన్లే. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 4500ఎంఏహెచ్, 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రియల్‌మీ ఎక్స్7 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్‌, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్ సెన్సార్ సెటప్‌తో రియర్ క్వాడ్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4310ఎంఏహెచ్ బ్యాటరీ, 50వాట్ సూపర్ డార్ట్ ఛార్జ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

  Poco M2: నిమిషానికి 5 ఫోన్లు కొనేస్తున్నారు... ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత ఏంటంటే

  Poco M3: పోకో ఎం3 లాంఛింగ్ డేట్ ఫిక్స్... రిలీజ్‌కు ముందే తెలిసిన ఫీచర్స్

  ఇక రియల్‌మీ ఎక్స్7 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్‌, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్ + 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ పోర్ట్‌రైట్ సెన్సార్‌తో క్వాడ్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

  First published:

  Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, Realme, Realme UI, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు