సరికొత్త ప్రాసెసర్, అదిరిపోయే ఫీచర్స్‌తో రిలీజైన Realme X7 Pro 5G, Realme X7 5G... ధర ఎంతంటే

సరికొత్త ప్రాసెసర్, అదిరిపోయే ఫీచర్స్‌తో రిలీజైన Realme X7 Pro 5G, Realme X7 5G... ధర ఎంతంటే (image: Realme India)

Realme X7 5G Smartphones | ఇండియాలో రియల్‌మీ ఎక్స్7 5జీ, రియల్‌మీ ఎక్స్7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ధర, ఫీచర్స్, ఇతర వివరాలు తెలుసుకోండి.

 • Share this:
  కొంతకాలంగా ఈ రెండు ఫోన్ల గురించి బాగా ప్రచారం చేస్తోంది రియల్‌మీ. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు చైనాలో రిలీజ్ కావడంతో స్పెసిఫికేషన్స్ దాదాపు తెలిసినవే. కానీ ఇండియాలో రిలీజ్ అయ్యే ఫోన్లలో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, ప్రత్యేకతలు ఏం ఉంటాయి, ధర ఎంత ఉండొచ్చు అని రియల్‌మీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. మొత్తానికి ఈ రెండు ఫోన్లను రిలీజ్ చేసింది రియల్‌మీ. Realme X7 5G ప్రత్యేకతలు చూస్తే 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌, 4310ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 50వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఇక Realme X7 Pro 5G విశేషాలు చూస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్‌, 4500ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 65వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్, Sony IMX686 సెన్సార్‌తో 64మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉన్నాయి.

  ఇండియాలో మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో తొలిసారి స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేసింది రియల్‌మీ. ఈ రెండూ 5జీ స్మార్ట్‌ఫోన్లే. ఇండియాలో ప్రస్తుతం 5జీ నెట్వర్క్ లేదు. భవిష్యత్తులో 5జీ నెట్వర్క్ ప్రారంభమైన తర్వాత ఫోన్ మార్చాల్సిన అవసరం లేకుండా ఈ ఫోన్లలోనే 5జీ నెట్వర్క్ ఉపయోగించుకోవచ్చు. ఇక ధర వివరాలు చూస్తే Realme X7 5G స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,999. మొదటి సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఫిబ్రవరి 12 మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఇక Realme X7 Pro 5G స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.29,999. మొదటి సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఫిబ్రవరి 10 మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.2,000, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

  New Smartphones in 2021: కొత్త ఫోన్ కొనాలా? 2021లో రిలీజైన స్మార్ట్‌ఫోన్స్ ఇవే

  Poco M3: రూ.10,000 లోపే 6GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్... పోకో ఎం3 ప్రత్యేకతలు ఇవే


  రియల్‌మీ ఎక్స్7 5జీ స్పెసిఫికేషన్స్
  డిస్‌ప్లే: 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్
  ర్యామ్: 6జీబీ, 8జీబీ
  ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
  ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ
  రియర్ కెమెరా: 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + అల్ట్రా వైడ్ సెన్సార్ + మ్యాక్రో సెన్సార్
  ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
  బ్యాటరీ: 4310ఎంఏహెచ్ (50వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ
  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
  కలర్స్: స్పేస్ సిల్వర్, నెబ్యులా
  ధర:
  6జీబీ+128జీబీ- రూ.19,999
  8జీబీ+128జీబీ- రూ.21,999


  రియల్‌మీ ఎక్స్7 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్
  డిస్‌ప్లే: 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్
  ర్యామ్: 8జీబీ
  ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
  ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 1000+
  రియర్ కెమెరా: 64 మెగాపిక్సెల్ Sony IMX686 ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + మ్యాక్రో సెన్సార్
  ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్
  బ్యాటరీ: 4500ఎంఏహెచ్ (65వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ
  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
  కలర్స్: మిస్టిక్ బ్లాక్
  ధర:
  8జీబీ+128జీబీ- రూ.29,999
  Published by:Santhosh Kumar S
  First published: