హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme X50m 5జీ: రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

Realme X50m 5జీ: రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

Realme X50m 5జీ: రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Realme X50m 5జీ: రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Realme X50m 5G | రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  రియల్‌మీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. రియల్‌మీ ఎక్స్50 5జీ కొత్త వేరియంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది కంపెనీ. రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ పేరుతో ఈ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ఫీచర్స్ రియల్‌మీ ఎక్స్50 స్మార్ట్‌ఫోన్ లాగానే ఉన్నాయి. కెమెరా కాస్త తగ్గింది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 30 వాట్ వూక్ 4.0 ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 12 జీబీ ర్యామ్ వేరియంట్ లేదు. రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ సేల్ ఏఫ్రిల్ 29న చైనాలో ప్రారంభం కానుంది. ఈ ఫోన్ ఇండియాకు ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతున్నందున రియల్‌మీ ఇప్పటికే లాంఛింగ్స్‌ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

  రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.57 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ హోల్-పంచ్ డిస్‌ప్లే

  ర్యామ్: 6జీబీ, 8జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ

  ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765జీ

  రియర్ కెమెరా: 48+8+2+2 మెగాపిక్సెల్

  ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 4200 ఎంఏహెచ్

  ఆపరేటింగ్ సిస్టమ్: రియల్‌మీ యూఐ+ఆండ్రాయిడ్ 10

  కలర్స్: గెలాక్సీ వైట్, స్టేరీ బ్లూ

  ధర:

  6జీబీ+128జీబీ- సుమారు రూ.21,500

  8జీబీ+128జీబీ- సుమారు రూ.25,000

  ఇవి కూడా చదవండి:

  Fitness Apps: స్మార్ట్ టీవీ ఉందా? ఈ ఫిట్‌నెస్ యాప్స్‌ ట్రై చేయండి

  Vodafone Idea: రోజూ 4 జీబీ డేటాతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్స్... వివరాలివే

  Aadhaar: ఆధార్‌పై కొత్త ఆర్డర్స్... మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Realme, Realme UI, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు