Realme X: బీ రెడీ... 'రియల్‌మీ ఎక్స్' ఇండియాకు వచ్చేస్తోంది

Realme X | 'రియల్‌మీ ఎక్స్' స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో ఇండియాకు వచ్చేస్తోందని రియల్‌మీ ఇండియా సీఈఓ అధికారికంగా తన ట్విట్టర్‌లో వెల్లడించడం విశేషం.

news18-telugu
Updated: July 1, 2019, 6:22 PM IST
Realme X: బీ రెడీ... 'రియల్‌మీ ఎక్స్' ఇండియాకు వచ్చేస్తోంది
Realme X: బీ రెడీ... 'రియల్‌మీ ఎక్స్' ఇండియాకు వచ్చేస్తోంది (Image: tech2/ Kshitij Pujari)
  • Share this:
రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రియల్‌మీ ఎక్స్' ఇండియాకు వచ్చేస్తోంది. మేలో చైనాలో లాంఛ్ చేసిన ఈ ఫోన్‌పై ఇండియన్ రియల్‌మీ ఫ్యాన్స్‌ నుంచి భారీ అంచనాలున్నాయి. 'రియల్‌మీ ఎక్స్' గురించి అన్నీ ఊహాగానాలే తప్ప ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న స్పష్టత లేదు. అయితే 'రియల్‌మీ ఎక్స్' స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో ఇండియాకు వచ్చేస్తోందని రియల్‌మీ ఇండియా సీఈఓ అధికారికంగా తన ట్విట్టర్‌లో వెల్లడించడం విశేషం. పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆనియన్ అండ్ గార్లిక్ వేరియంట్‌ రానుందన్న విషయం రియల్‌మీ ఫ్యాన్స్‌కు తెలిసిందే. అంతేకాదు... 'స్పైడర్-మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్' సినిమా స్పెషల్ ఎడిషన్ 'రియల్‌మీ ఎక్స్' లాంఛ్ చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. 'స్పైడర్-మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్' సినిమా జూలై 4న రిలీజ్ కానుంది. మరి ఫోన్ ఎప్పుడు లాంఛ్ అవుతుందో తెలియదు.




రియల్‌మీ ఎక్స్ స్పెసిఫికేషన్స్- చైనా వేరియంట్డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సెల్స్
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 710
రియర్ కెమెరా: 48+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,765 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + కలర్ ఓఎస్ 6.0

BMW Bike: బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Tata Sky: టాటాస్కై సెట్-టాప్ బాక్సుల ధరలు తగ్గాయి

IRCTC-Aadhaar Link: ఐఆర్‌సీటీసీతో ఆధార్ లింక్ చేస్తే లాభమిదే...

Realme C2: ఎక్స్‌ఛేంజ్‌లో రూ.99 ధరకే రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్
First published: July 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు