Realme: రియల్‌మి నుంచి ప్రపంచంలోనే తొలి 64 ఎంపీ క్వాడ్ కెమెరా ఫోన్ విడుదలకు సిద్ధం...

క్వాడ్ కెమెరా ఫోన్ ను ఈ నెల 8న మార్కెట్లో రిలీజ్ చేస్తున్నామని మాధవ్ సేథ్ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ఢిల్లీలో జరిగే కార్యక్రమం ద్వారా గ్రాండ్ గా లాంచ్ చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

news18-telugu
Updated: August 2, 2019, 5:59 PM IST
Realme: రియల్‌మి నుంచి ప్రపంచంలోనే తొలి 64 ఎంపీ క్వాడ్ కెమెరా ఫోన్ విడుదలకు సిద్ధం...
క్వాడ్ కెమెరా (Image: Twitter)
news18-telugu
Updated: August 2, 2019, 5:59 PM IST
డ్యుయల్ కెమెరా, ట్రిపుల్ కెమెరా స్థాయిని దాటి ప్రస్తుతం ప్రపంచంలోనే మొట్టమొదటి క్వాడ్ కెమెరా స్మార్ట్ ఫోన్ విడుదల చేసేందుకు చైనీస్ మొబైల్ ఫోన్ దిగ్గజం రియల్‌మి సిద్ధమైంది. దాదాపు 64 మెగా పిక్సెస్ సామర్థ్యం కలిగిన క్వాడ్ కెమెరాతో ఫోటోలు తీయడం ద్వారా కస్టమర్లు కొత్త అనుభూతికి లోనవుతారని ఆ కంపెనీ ఇండియా సీఈవో మాధవ్ సేథ్ తెలిపారు. అంతే కాదు క్వాడ్ కెమెరా ఫోన్ ను ఈ నెల 8న మార్కెట్లో రిలీజ్ చేస్తున్నామని మాధవ్ సేథ్ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ఢిల్లీలో జరిగే కార్యక్రమం ద్వారా గ్రాండ్ గా లాంచ్ చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచంలోనే తొలిసారి 64 ఎంపీ క్వాడ్‌ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్ అందించడం గర్వకారణమని తెలిపారు. ఆయన తన ట్వీట్‌లో వెర్టికల్ సెటప్‌లో ఉన్న ఫోన్ కెమెరా ఫొటోను పోస్టు చేశారు. మొత్తం నాలుగు కెమెరా లెన్సులు ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి. అయితే ఇంకా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.



First published: August 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...