REALME WILL SHOW ADS IN THEIR SMARTPHONES KNOW HOW TO DISABLE SS
Realme: రియల్మీ ఫోన్ వాడుతున్నారా? అయితే మీకు ఈ సమస్య తప్పదు
Realme: రియల్మీ ఫోన్ వాడుతున్నారా? అయితే మీకు ఈ సమస్య తప్పదు
(ప్రతీకాత్మక చిత్రం)
Realme | మేము స్మార్ట్ఫోన్లు మాత్రమే అమ్ముతాం యాడ్స్ కాదంటూ ప్రకటించింది. షావోమీకి సవాల్ విసురుతూ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. కానీ... ఇప్పుడు వ్యాపార వ్యూహాన్ని మార్చింది రియల్మీ.
మీరు రియల్మీ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? రియల్మీ ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఒక్క నిమిషం. రియల్మీ కంపెనీ తమ వ్యాపార వ్యూహాన్ని మార్చేసింది. స్మార్ట్ఫోన్లలో యాడ్స్ పోస్ట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించే బాటలో నడుస్తోంది. షావోమీ స్మార్ట్‌ఫోన్లల్లో యాడ్స్ వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. షావోమీ ఈ వ్యూహాన్ని ఎప్పట్నుంచో పాటిస్తోంది. రెండుమూడేళ్లుగా స్మార్ట్‌ఫోన్‌లో యాడ్స్ పోస్ట్ చేస్తూ డబ్బు సంపాదిస్తోంది. కానీ... రియల్మీ మాత్రం తమది అలాంటి వ్యూహం కాదని మొదట్లోనే ప్రకటించింది. మేము స్మార్ట్ఫోన్లు మాత్రమే అమ్ముతాం యాడ్స్ కాదంటూ ప్రకటించింది. షావోమీకి సవాల్ విసురుతూ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. కానీ... ఇప్పుడు వ్యాపార వ్యూహాన్ని మార్చింది రియల్మీ. తమ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లల్లో కూడా యాడ్స్ చూపించబోతోంది. షావోమీ స్మార్ట్ఫోన్లలాగానే ఇకపై రియల్మీ ఫోన్లల్లో కూడా యాడ్స్ కనిపించబోతున్నాయి. త్వరలో ఇందుకు సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి. కలర్ ఓఎస్ అప్డేట్ చేసిన తర్వాత రియల్మీ ఫోన్లో యాడ్స్ కనిపించనున్నాయి. అయితే యాడ్స్ అనే పేరుతో కాకుండా 'కంటెంట్ రికమండేషన్స్' పేరుతో ఈ యాడ్స్ చూపించనుంది రియల్మీ.
రియల్మీ స్మార్ట్‌ఫోన్లల్లో యాడ్స్ డిసేబుల్ చేయడానికి సెట్టింగ్స్ ఇవే... (Source: Realme)
రియల్మీ ఫోన్లల్లో యాడ్స్ ఆపెయ్యండి ఇలా...
షావోమీలో యాడ్స్ విపరీతంగా రావడం నచ్చనివాళ్లు ఇతర బ్రాండ్ స్మార్ట్ఫోన్లు కొంటుంటారు. అలా షావోమీకి పోటీ ఇచ్చిన కంపెనీల్లో రియల్మీ కూడా ఒకటి. అయితే ఇప్పుడు రియల్మీ ఫోన్లల్లో కూడా యాడ్స్ రావడం యూజర్లకు ఊహించని షాకే. అయితే యాడ్స్ వద్దనుకుంటే డిసేబుల్ చేసే ఆప్షన్ ఇస్తోంది రియల్మీ. ఇందుకోసం మీరు సెట్టింగ్స్ మారిస్తే సరిపోతుంది. ఒకవేళ రియల్మీ పోస్ట్ చేసే యాడ్స్ లేదా 'కంటెంట్ రికమండేషన్స్' మీరు చూడొద్దనుకుంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అందులో అడిషనల్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. స్క్రోల్ డౌన్ చేస్తే Get Recommendations ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసి బటన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మీకు కంటెంట్ రికమండేషన్స్ కనిపించవు. కంటెంట్ రికమండేషన్స్ గురించి రియల్మీ ఇచ్చిన స్టేట్మెంట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Realme x2 pro: అదిరిపోయిన రియల్మీ ఎక్స్2 ప్రో' మాస్టర్ ఎడిషన్... ఫోన్ ఎలా ఉందో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.