హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme Watch 3 Pro: ఇండియాలో రియల్‌మీ వాచ్ 3 ప్రో స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్లు అయితే సూపరో సూపర్..

Realme Watch 3 Pro: ఇండియాలో రియల్‌మీ వాచ్ 3 ప్రో స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్లు అయితే సూపరో సూపర్..

Realme Watch 3 Pro

Realme Watch 3 Pro

Realme Watch 3 Pro: రియల్‌మీ మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ను కంపెనీ భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. రియల్‌మీ వాచ్ 3 ప్రో పేరుతో ఇది లాంచ్ అయింది. దీని ఫీచర్లు తెలిస్తే మీరు వావ్ అనాల్సిందే.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

స్మార్ట్‌బ్రాండ్ రియల్‌మీ (Realme) ఇండియా (India)లో అన్ని రకాల స్మార్ట్ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ల తర్వాత వేరబుల్ మార్కెట్‌లో కంపెనీ ప్రొడక్ట్స్‌కు భారీ డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ తాజాగా మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ (Smartwatch)ను కంపెనీ భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. రియల్‌మీ వాచ్ 3 ప్రో (Realme Watch 3 Pro) పేరుతో ఇది లాంచ్ అయింది. రియల్‌మీ C33 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్, రియల్‌మీ బడ్స్ ఎయిర్ 3S TWS ఇయర్‌బడ్స్‌తో పాటు కంపెనీ తాజా స్మార్ట్‌వాచ్‌ను రిలీజ్ చేసింది. దీని ధర, ఫీచర్లు చెక్ చేద్దాం.రియల్‌మీ వాచ్ 3 ప్రో డివైజ్.. ఈ సిరీస్‌ నుంచి వచ్చిన లగ్జరీ వెర్షన్‌గా చెప్పుకోవచ్చు. దీంట్లో కంపెనీ హై రేంజ్ ఫీచర్లను అందించింది. స్మార్ట్‌వాచ్ స్క్వేర్ షేప్డ్ డయల్‌తో ఆకట్టుకుంటుంది. దీనికి కుడివైపు ఫిజికల్ హార్డ్‌వేర్ బటన్‌ ఉంటుంది. ఇతర బ్రాండ్‌ల నుంచి రూ.5వేల రేంజ్‌లో వచ్చిన స్మార్ట్‌ వాచ్‌లతో రియల్‌మీ వాచ్ 3 ప్రో పోటీ పడనుంది. ఈ స్మార్ట్‌వాచ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. దీంట్లో ఇన్‌బిల్ట్ GPS ఉంటుంది. దీంతో లొకేషన్‌ను కచ్చితత్వంతో అంచనా వేయవచ్చు. అలాగే బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌ను ట్రాక్ చేయవచ్చు.
* డిజైన్
రియల్‌మీ వాచ్ 3 ప్రో 368×448 పిక్సెల్ రిజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేసే 1.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఆల్వేస్ ఆన్-డిస్‌ప్లే ఫీచర్ దీంట్లో ఉంటుంది. రిమూవబుల్ 22mm సిలికాన్ స్ట్రాప్‌తో, రెక్టాంగులర్ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది.


* ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
రియల్‌మీ వాచ్ 3 ప్రో లో అనేక ఫిట్‌నెస్, స్పోర్ట్స్ మోడ్స్‌ ఉన్నాయి. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ, IP68 రేట్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఇండోర్, అవుట్‌డోర్ రన్నింగ్, బాక్సింగ్, రోయింగ్ మెషిన్, గోల్ఫ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, అవుట్‌డోర్ సైకిల్ వంటి ఫీచర్లతో పాటు ఈ డివైజ్ 100కి పైగా స్పోర్ట్స్ మోడ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. హై క్వాలిటీ స్పీకర్లు, ఇన్‌బిల్ట్ స్మార్ట్ పవర్ యాంప్లిఫైయర్, AI నాయిస్ క్యాన్సిలేషన్ అల్గారిథమ్‌తో బ్లూటూత్ కాలింగ్‌ సపోర్ట్.. వంటి ఫీచర్లు ఈ స్మార్ట్‌వాచ్ సొంతం.
రియల్‌మీ వాచ్ 3 ప్రో 345mAh బ్యాటరీతో వస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో ఇది 10 రోజుల వరకు రన్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దీని సొంతం. స్టెప్ కౌంట్, అలారం, క్యాలరీ కౌంట్, పీరియడ్స్ ట్రాకర్, లింక్డ్‌ ఫోన్‌ నోటిఫికేషన్స్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు దీంట్లో ఉన్నాయి. వాచ్ 3 ప్రోలో యాక్సిలరోమీటర్, 24/7 హార్ట్ రేట్ సెన్సార్, SpO2 బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ సెన్సార్ వంటి అడ్వాన్డ్స్‌డ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి : పిక్సెల్ 7 ఫోన్, గూగుల్ స్మార్ట్‌వాచ్ లాంచ్‌ కి ముహుర్తం ఫిక్స్.. కొత్త ప్రొడక్ట్స్ ఫీచర్లు, డిజైన్ వివరాలివే..
5 GNSS సిస్టమ్స్‌తో కూడిన మల్టీ-సిస్టమ్ స్టాండలోన్ GPS ఈ స్మార్ట్‌వాచ్‌లో ఉంటుంది. దీని ద్వారా లొకేషన్‌ను అత్యంత కచ్చితత్వంతో ట్రాక్ చేయవచ్చు. ఫోన్‌తో సంబంధం లేకుండా అవుట్‌డోర్ యాక్టివిటీస్ ట్రాక్ చేయగల వాచ్‌గా యూజర్లకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
* ధర ఎంత?
ఇండియాలో రియల్‌మీ వాచ్ 3 ప్రో ధర రూ. 4,499గా ఉంది. ఇది బ్లాక్, గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ సేల్స్ సెప్టెంబర్ 9 నుంచి, అంటే నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ , రియల్‌మీ వెబ్‌సైట్ల ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Realme, Smart phones, Tech news

ఉత్తమ కథలు