హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme: కొత్త ప్రొడక్ట్స్‌ను విడుదల చేసిన రియల్‌మీ.. మార్కెట్లోకి స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్ బడ్స్

Realme: కొత్త ప్రొడక్ట్స్‌ను విడుదల చేసిన రియల్‌మీ.. మార్కెట్లోకి స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్ బడ్స్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ భారత మార్కెట్లోకి అనేక వేరబుల్‌ గ్యాడ్జెట్‌లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలో రియల్‌మీ వాచ్ 2, వాచ్ 2 ప్రో, బడ్స్ వైర్‌లెస్ 2, బడ్స్ వైర్‌లెస్ 2 నియో, బడ్స్ క్యూ 2 నియో వంటి వేరబుల్‌ గ్యాడ్జెట్‌లను విడుదల చేసింది.

ఇంకా చదవండి ...

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ భారత మార్కెట్లోకి అనేక వేరబుల్‌ గ్యాడ్జెట్‌లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలో రియల్‌మీ వాచ్ 2, వాచ్ 2 ప్రో, బడ్స్ వైర్‌లెస్ 2, బడ్స్ వైర్‌లెస్ 2 నియో, బడ్స్ క్యూ 2 నియో వంటి వేరబుల్‌ గ్యాడ్జెట్‌లను విడుదల చేసింది. రియల్‌మీ వాచ్ 2 ప్రో ధరను రూ .4,999గా నిర్ణయించారు. ఈ వాచ్ రియల్‌మీ.కామ్, అమెజాన్.ఇన్ వెబ్‌సైట్లలో జూలై 26 నుంచి సేల్ కి రానుంది. ఈ వాచ్ స్పేస్ గ్రే, మెటాలిక్ సిల్వర్ అనే 2 రంగులలో అందుబాటులోకి రానుంది. వాచ్ 2 ప్రోలో 1.75-అంగుళాల కలర్ డిస్‌ప్లే ఉంటుంది. 320×385 పిక్సెల్స్ రిజల్యూషన్ గల స్క్రీన్ లో 600 నిట్స్ ఉంటాయి. దీనివల్ల వాచ్ స్క్రీన్ చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీనిలో హార్ట్ రేట్, నిద్ర, ఆక్సిజన్ స్థాయిలు ట్రాక్ చేసే సెన్సార్లు ఉంటాయి. దీనిలో 90వర్క్ మోడ్‌లు కూడా ఉన్నాయి. డ్యూయల్-శాటిలైట్ జీపీఎస్ తో వచ్చే ఈ వాచ్ లో 390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 14 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది.

రియల్‌మీ వాచ్ 2 ధరను రూ .3,499గా నిర్ణయించారు. దీనిలో రియల్‌మీ వాచ్ 2 ప్రోలో ఉన్న అన్ని ఫీచర్స్ ఉంటాయి. కానీ ప్రో- వేరియంట్‌తో పోల్చుకుంటే.. వాచ్ 2 డిస్‌ప్లే సైజు కొంచెం చిన్నగా ఉంటుంది. ఇది 1.4 అంగుళాల కలర్ డిస్‌ప్లే తో వస్తుంది. ఇది జూలై 26న ఫ్లిప్ కార్ట్ లో విడుదల కానుంది. ఫ్లిప్ కార్ట్ ఫస్ట్ సేల్ లో దీనిపై 500 డిస్కౌంట్ లభిస్తుంది.

రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 2 ధర రూ .2,299 గా నిర్ణయించారు. ఇది జూలై 26న రియల్‌.కామ్, ఫ్లిప్‌కార్ట్ సైట్స్‌లో విడుదల కానుంది. 25dB వరకు యాక్టీవ్ వాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ చేస్తుంది. 13.6ఎంఎం బేస్ బూస్ట్ డ్రైవర్ తో వచ్చే ఈ బడ్స్ సోనీ LDAC హైరిజల్యూషన్ ఆడియోకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో గేమింగ్ కోసం 88ఎంఎస్ లేటెన్సీ మోడ్‌ కూడా ఉంటుంది. ఇది 22 గంటల ప్లేబ్యాక్ సామర్థ్యం కలిగి ఉంది.


బడ్స్ వైర్‌లెస్ 2 నియో ధర రూ.1,499 గా నిర్ణయించారు. ఇది రియల్‌మీ.కామ్, అమెజాన్.ఇన్ వెబ్‌సైట్లలో విడుదల కానుంది. ఈ బడ్స్ లో ఎన్విరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంటుంది. 11.2ఎంఎం బేస్ బూస్ట్ డ్రైవర్ తో వచ్చే ఈ బడ్స్ లో 88ఎంఎస్ లేటెన్సీ మోడ్‌ ఉంటుంది. ఇది 17 గంటల ప్లేబ్యాక్ సామర్థ్యం కలిగి ఉంది.


బడ్స్‌ క్యూ 2 నియో జూలై 29న రియల్‌మీ.కామ్, ఫ్లిప్‌కార్ట్ సైట్స్ లలో రూ .1,599 ధరకు సేల్ కి రానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ఫస్ట్ సేల్ లో దీనిపై రూ .300 కు రాయితీ లభిస్తుంది. దీనిలో 10 ఎంఎం డైనమిక్ బాస్ బూస్ట్ డ్రైవర్, 88 ఎంఎస్ లేటెన్సీ గేమింగ్ మోడ్, ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది సింగిల్ ఛార్జీపై 20 గంటల ప్లేబ్యాక్‌ సామర్థ్యం కలిగి ఉంటుంది.

First published:

Tags: Technology