Realme V11s 5G: మార్కెట్లోకి విడుదలైన రియల్‌మీ V11s 5G స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..

ప్రతీకాత్మకచిత్రం

రియల్‌మీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌మీ వీ11 ఎస్ (Realme V11s 5G) పేరుతో రూపొందించిన 5G హ్యాండ్‌సెట్‌ను చైనాలో తాజాగా లాంచ్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన రియల్‌మీ V11 5G స్మార్ట్‌ఫోన్‌కు అప్‌డేటెడ్ వెర్షన్‌గా కొత్త డివైజ్‌ను లాంచ్ చేసింది.

  • Share this:
రియల్‌మీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌మీ వీ11 ఎస్ (Realme V11s 5G) పేరుతో రూపొందించిన 5G హ్యాండ్‌సెట్‌ను చైనాలో తాజాగా లాంచ్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన రియల్‌మీ V11 5G స్మార్ట్‌ఫోన్‌కు అప్‌డేటెడ్ వెర్షన్‌గా కొత్త డివైజ్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో డైనమిక్ ర్యామ్ ఎక్స్‌పాన్షన్ (DRE) ఆప్షన్ కూడా ఉంది. దీని సాయంతో ఇంటర్నల్ స్టోరేజ్ ద్వారా ర్యామ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

స్పెసిఫికేషన్ల పరంగా, రియల్‌మీ V11s 5G డివైజ్.. రియల్‌మీ V11 మోడల్ మాదిరిగానే ఉంటుంది. హ్యాండ్‌సెట్ బాడీ, డ్యుయల్ రియర్ కెమెరా సెటప్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ వంటి ఫీచర్లన్నీ రెండింట్లో ఒకేలా ఉన్నాయి. రియల్‌మీ V11s 5G స్మార్ట్‌ఫోన్‌ 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను మైక్రో SD స్లాట్ ద్వారా 1TB వరకు పొడిగించుకోవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,399 (సుమారు రూ. 16,000)గా ఉంది. ఇందులో 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,599 (సుమారు రూ. 18,200) వరకు ఉంది. బ్లాక్, వయొలెట్ కలర్ ఆప్షన్లలో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్.. రియల్‌మీ చైనా వెబ్‌సైట్, చైనాలోని ఇతర ఆన్‌లైన్ రిటైలర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.

రియల్‌మీ V11s 5G స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ UI 2.0తో పనిచేస్తుంది. 6.5 అంగుళాల డిస్‌ప్లే, 88.5 స్క్రీన్-టు-బాడీ రేషియోతో లభిస్తుంది. ఈ డివైజ్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC, మాలి G57 GPU చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. V11s 5G స్మార్ట్‌ఫోన్‌లో DRE ఆప్షన్ ఉంటుంది. దీని సాయంతో RAM సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. DRE ఆప్షన్‌తో 4GB RAM వేరియంట్‌లో ర్యామ్‌ను 5GB వరకు.. 6GB RAM వేరియంట్‌లో ర్యామ్‌ను 11GB వరకు పొడిగించుకోచ్చు.

రియల్‌మీ V11s 5Gలో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్‌తో పాటు 8MP ఫ్రంట్ కెమెరాను చేర్చారు. రియల్‌మీ V11 5G డివైజ్‌ మాదిరిగానే ఇందులోని కెమెరాలు దీర్ఘచతురస్రాకార మాడ్యూల్‌లో, LED ఫ్లాష్‌తో వచ్చాయి. 5G, 4G, Wi-Fi, బ్లూటూత్, GPS వంటి కనెక్టివిటీ ఆప్షన్లు.. ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సెలెరోమీటర్, పవర్ బటన్‌లో పొందుపరిచిన ఫింగర్‌ప్రింట్ సెన్సార్.. వంటి ఆన్‌బోర్డ్ సెన్సార్లు ఇందులో ఉన్నాయి. రియల్‌మీ V11s 5G స్మార్ట్‌ఫోన్‌ 5,000mAh బ్యాటరీతో, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. కేవలం 8.4 మి.మీ మందం ఉండే ఈ స్మార్ట్‌ఫోన్‌ 189 గ్రాముల బరువు ఉంటుంది. దీన్ని భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనే వివరాలను రియల్‌మీ ప్రకటించలేదు.
Published by:Krishna Adithya
First published: