స్మార్ట్‌ఫోన్ (Smart Phone) బ్రాండ్ రియల్‌మీ మరికొన్ని కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. ఏప్రిల్ 29న జరిగిన లాంచ్ ఈవెంట్‌లో ఈ ప్రొడక్ట్స్ ధరలు, ఫీచర్ల వివరాలను కంపెనీ వెల్లడించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి 150W ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్ అయిన రియల్‌మీ GT నియో 3 (Realme GT Neo 3)తో పాటు రియల్‌మీ ప్యాడ్ మినీ (Realme Pad Mini) టాబ్లెట్, రియల్‌మీ బడ్స్ Q2s (Realme Buds Q2s) పేరుతో కొత్త TWS ఇయర్‌బడ్స్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఈ ట్యాబ్లెట్, ఇయర్ బడ్స్ స్పెసిఫికేషన్స్ చూద్దాం.
WhatsApp: వాట్సప్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్.. రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఒకే ఎకౌంట్ వాడొచ్చు!
రియల్‌మీ ప్యాడ్ మినీ ధర
రియల్‌మీ ప్యాడ్ మినీ బేస్ 3GB RAM + 32GB స్టోరేజ్ వేరియంట్ Wi-Fi కనెక్టివిటీతో మాత్రమే వస్తుంది. దీని ప్రారంభ ధర రూ.10,999. Wi-Fi ఓన్లీ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999. 3GB RAM + 32GB స్టోరేజ్ ఆప్షన్‌లో Wi-Fi + LTE వేరియంట్ ధర రూ. 12,999. టాప్-స్పెక్ Wi-Fi + LTE 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. ఈ టాబ్లెట్ బ్లూ, గ్రే వంటి రెండు కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అయింది. వీటి సేల్స్ మే 2 నుంచి ఫ్లిప్‌కార్ట్, Realme.com, ఆఫ్‌లైన్ రిటైలర్‌లలో ప్రారంభమవుతాయి. కంపెనీ నాలుగో వార్షికోత్సవ ఆఫర్‌గా.. మే 2 నుంచి మే 9 మధ్య రూ. 2,000 డిస్కౌంట్ లభిస్తుంది.
రియల్‌మీ బడ్స్ Q2s ధర, ఆఫర్లు
రియల్‌మీ బడ్స్ Q2s రూ. 1,999 ధరతో లాంచ్ అయ్యాయి. ఈ TWS ఇయర్‌బడ్స్.. నైట్ బ్లాక్, పేపర్ గ్రీన్, పేపర్ వైట్ కలర్ వంటి మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తాయి. ఇవి మే 2 నుంచి ఫ్లిప్‌కార్ట్, Realme.com, ఇతర ఆఫ్‌లైన్ రిటైలర్‌లలో అమ్మకానికి వస్తాయి.
రియల్‌మీ ప్యాడ్ మినీ స్పెసిఫికేషన్స్
ఈ ట్యాబ్ HD+ రిజల్యూషన్‌తో 8.7-అంగుళాల LCD డిస్‌ప్లేతో వస్తుంది. టాబ్లెట్ 4GB వరకు RAM, 64GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో జత చేసిన Unisoc T616 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. దీంట్లో 8-మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్ ఉంటుంది. Wi-Fi, బ్లూటూత్ v5.0, USB టైప్-C పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీని LTE + Wi-Fi వేరియంట్‌లు 4G LTEతో కూడా వస్తాయి.
రియల్‌మీ బడ్స్ Q2s స్పెసిఫికేషన్లు
రియల్‌మీ బడ్స్ Q2s 10mm డైనమిక్ డ్రైవర్స్‌తో వస్తాయి. ఇవి డీప్ బాస్‌తో హై క్వాలిటీ మిడ్-టు-హై సౌండ్‌ను అందజేస్తాయి. 88 మిల్లీసెకన్ల లో-లేటెన్సీ రేటు, ఎన్విరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. ఈ బడ్స్ టచ్ కంట్రోల్స్‌తో వస్తాయి. 10 మీటర్ల వరకు కనెక్టివిటీ రేంజ్‌ను అందించే బ్లూటూత్ v5.2ని కలిగి ఉంటాయి. IPX4 రేటింగ్ వాటర్ రెసిస్టెన్స్, ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్ ఉంది. రియల్‌మీ బడ్స్ Q2s ఛార్జింగ్ కేస్‌తో సహా గరిష్టంగా 30 గంటల వరకు కలిపి బ్యాటరీ లైఫ్ అందిస్తాయని కంపెనీ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gadgets, Latest Technology, Realme, Smart phone