రియల్మీ ఫ్యాన్స్‌కు శుభవార్త. రియల్మీ నుంచి కొత్త సిరీస్ స్మార్ట్ఫోన్లు రిలీజ్ కాబోతున్నాయి. మార్చిలోనే రియల్మీ నార్జో సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ లాంఛింగ్ రెండు సార్లు వాయిదా పడింది. రియల్మీ నార్జో 10, రియల్మీ నార్జో 10ఏ స్మార్ట్ఫోన్లు మార్చి 26న రిలీజ్ కావాల్సి ఉండగా లాక్డౌన్ కారణంగా ఈవెంట్ వాయిదా పడింది. ఆ తర్వాత ఏప్రిల్ 21న ఈ ఫోన్లు లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించింది రియల్మీ. అప్పుడు కూడా లాక్డౌన్ కారణంగా లాంఛింగ్ వాయిదా వేసింది కంపెనీ. ప్రస్తుతం లాక్డౌన్ ఆంక్షల్లో కొన్ని సడలింపులు ఉండటంతో మే 11న మధ్యాహ్నం 12.30 గంటలకు రియల్మీ నార్జో 10, రియల్మీ నార్జో 10ఏ లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించింది రియల్మీ.
రియల్మీ నుంచి ఇప్పటికే ప్రో, ఎక్స్, యూ, సీ సిరీస్ స్మార్ట్ఫోన్లు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ సిరీస్ ఫోన్లన్నీ ఉన్నాయి. వాటితో పాటు నార్జో సిరీస్ స్మార్ట్ఫోన్లను కొత్తగా ప్రకటించింది రియల్మీ. రియల్మీ నార్జో 10, రియల్మీ నార్జో 10ఏ మొబైల్స్ షావోమీకి చెందిన పోకో ఎఫ్1, పోకో ఎక్స్2 స్మార్ట్ఫోన్లకు పోటీ ఇస్తాయని భావిస్తున్నారు. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 48 మెగాపిక్సెల్ కెమెరా, భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.