హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme 7: రేపే రియల్‌మీ 7, రియల్‌మీ 7 ప్రో రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే

Realme 7: రేపే రియల్‌మీ 7, రియల్‌మీ 7 ప్రో రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే

Realme 7: రేపే రియల్‌మీ 7, రియల్‌మీ 7 ప్రో రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే
(image: Realme India)

Realme 7: రేపే రియల్‌మీ 7, రియల్‌మీ 7 ప్రో రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే (image: Realme India)

Realme 7 Series Launch | రియల్‌మీ నుంచి రియల్‌మీ 7, రియల్‌మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్ వచ్చేస్తున్నాయి. వచ్చే వారమే ఈ ఫోన్లు రిలీజ్ కానున్నాయి.

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన రియల్‌మీ దూకుడుగా మొబైల్స్ రిలీజ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే రియల్‌మీ సీ15, రియల్‌మీ సీ12 స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రియల్‌మీ 7 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను తీసుకురానుంది. సెప్టెంబర్ 3న రియల్‌మీ 7, రియల్‌మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేయనుంది. ఇండియాలో ఇప్పటికే రియల్‌మీ 1, 2, 3, 5, 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది కంపెనీ. మధ్యలో 4 సిరీస్‌ను రిలీజ్ చేయకుండా నేరుగా 5 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసింది. మార్చిలో 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. ఇప్పుడు 7 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసేందుకు కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ 3 మధ్యాహ్నం 12.30 గంటలకు రియల్‌మీ 7 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల లాంఛింగ్ ఉంటుంది.

Redmi 9A: బ్యాటరీ ఎక్కువ... ధర తక్కువ... రెడ్‌మీ 9ఏ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది

Nokia 5.3: రెడ్‌మీ, రియల్‌‌మీకి పోటీగా నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్... సేల్ ప్రారంభం

రియల్‌మీ 7 సిరీస్ విషయంలో ప్రస్తుతం అనేక స్పెసిఫికేషన్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లలో 6.5 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. రియల్‌మీ 7 ప్రో మోడల్‌లో అమొలెడ్ డిస్‌ప్లే ఉండొచ్చని అంచనా. మీడియాటెక్ జీ95 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బ్యాటరీ 4,500 ఎంఏహెచ్ ఉంటుంది. 64వాట్ సూపర్ డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని ఇప్పటికే రియల్‌మీ ప్రకటించింది. రియల్‌మీ 7 స్మార్ట్‌‌ఫోన్‌ మాత్రం 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రియర్ కెమెరా 64+12+5+2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16మెగాపిక్సెల్ ఉండొచ్చు. 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో ఈ ఫోన్లు రిలీజ్ కావొచ్చు. ధర కూడా రూ.15,000 లోపే ఉండొచ్చు. అయితే ఇవన్నీ ప్రచారంలో ఉన్న స్పెసిఫికేషన్సే. రియల్‌మీ 7, రియల్‌మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్లలో పూర్తి ఫీచర్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే సెప్టెంబర్ 3 వరకు ఆగాల్సిందే.

First published:

Tags: Android 10, Realme, Realme UI, Smartphone

ఉత్తమ కథలు