Realme 5: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు... ఆగస్ట్ 20న రిలీజ్

Realme 5 Series Smartphones | రియల్‌మీ 5 సిరీస్‌లో రియల్‌మీ 5, రియల్‌మీ 5 ప్రో మోడల్స్ ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. నాలుగు కెమెరాలతో ఈ ఫోన్ రావడం విశేషం. 

news18-telugu
Updated: August 13, 2019, 3:01 PM IST
Realme 5: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు... ఆగస్ట్ 20న రిలీజ్
Realme 5: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు... ఆగస్ట్ 20న రిలీజ్
news18-telugu
Updated: August 13, 2019, 3:01 PM IST
రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రియల్‌మీ 5 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే రియల్‌మీ 1, 2, 3 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఇండియాకు పరిచయం చేసిన రియల్‌మీ ఇప్పుడు 5 సిరీస్ ఫోన్లను తీసుకొచ్చేస్తోంది. అయితే మరి 4 సిరీస్ ఏమైంది అన్న అనుమానం రావొచ్చు. చైనాలో 4 అంకెను అన్‌లక్కీ నెంబర్‌గా భావిస్తుంటారు. అందుకే కంపెనీలు కూడా 4 నెంబర్‌ను పెద్దగా పట్టించుకోవు. ఇంతకుముందు వన్‌ప్లస్ కూడా 3, 3టీ ఫోన్ల తర్వాత నేరుగా 5 సిరీస్ ఫోన్లు రిలీజ్ చేసింది. చైనాకు చెందిన కంపెనీ అయిన రియల్‌మీ కూడా 4 సిరీస్‌ను తీసుకురావట్లేదన్న ప్రచారం ఉంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. కంపెనీ మాత్రం రియల్‌మీ 5 సిరీస్ ఫోన్లను తీసుకొస్తున్నట్టు ప్రకటించేసింది. ఆగస్ట్ 20 మధ్యాహ్నం 12.30 గంటలకు రియల్‌మీ 5 సిరీస్‌ ఇండియాలో రిలీజ్ కానుంది.





రియల్‌మీ 5 సిరీస్‌లో రియల్‌మీ 5, రియల్‌మీ 5 ప్రో మోడల్స్ ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. నాలుగు కెమెరాలతో ఈ ఫోన్ రావడం విశేషం. రియల్‌మీ 5 సిరీస్‌లో 48 మెగాపిక్సెల్ Sony IMX586 కెమెరా ఉంది. ప్రైమరీ, అల్ట్రా వైడ్ యాంగిల్, సూపర్ మ్యాక్రో, పోర్ట్‌రైట్ లెన్స్‌లు ఉండటం రియల్‌మీ 5 సిరీస్‌ ప్రత్యేకత. ఈ ఫోన్ల ఫీచర్ల గురించి తెలియాల్సి ఉంది. మరోవైపు Samsung ISOCELL Bright GW1 ఇమేజ్ సెన్సార్‌తో 64 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్‌ను కూడా ప్రకటించింది రియల్‌మీ. దీపావళి కన్నా ముందే ఈ ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది రియల్‌మీ.
Loading...
Realme X: ఉల్లి, వెల్లుల్లి థీమ్‌తో రియల్‌మీ ఎక్స్... లుక్స్ అదుర్స్


ఇవి కూడా చదవండి:

Jio Postpaid Plus: ఒకే మొబైల్ కనెక్షన్... ఇంట్లో అందరికీ 4జీ డేటా...

ICICI: వడ్డీ లేకుండా అప్పు ఇస్తున్న ఐసీఐసీఐ... పేలేటర్ అకౌంట్ వివరాలివే

WhatsApp: మీ వాట్సప్‌ని అద్బుతంగా మార్చే 8 ఫీచర్లు ఇవే
First published: August 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...