Realme Smartwatch: యాపిల్ వాచ్‌కు పోటీగా రియల్‌మీ స్మార్ట్‌వాచ్

Realme Smartwatch | ఇండియాకు స్మార్ట్‌ఫోన్లతో పాటు పవర్ బ్యాంక్ లాంటి యాక్సెసరీస్ తీసుకొచ్చిన రియల్‌మీ... స్మార్ట్‌వాచ్, స్మార్ట్‌టీవీలను కూడా పరిచయం చేయనుంది.

news18-telugu
Updated: May 20, 2020, 5:34 PM IST
Realme Smartwatch: యాపిల్ వాచ్‌కు పోటీగా రియల్‌మీ స్మార్ట్‌వాచ్
Realme Smartwatch: యాపిల్ వాచ్‌కు పోటీగా రియల్‌మీ స్మార్ట్‌వాచ్
  • Share this:
స్మార్ట్‌వాచ్ కొనాలనుకుంటున్నారా? స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ ఇండియాలో మొదటి స్మార్ట్‌వాచ్ రిలీజ్ చేయబోతోంది. మే 25న మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మీ స్మార్ట్ టీవీతో పాటు స్మార్ట్‌వాచ్ రిలీజ్ కానున్నాయి. రియల్‌మీ స్మార్ట్‌వాచ్ చూడ్డానికి యాపిల్ వాచ్‌లా ఉంది. 1.4 అంగుళాల లార్జ్ కలర్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. రియల్‌మీ స్మార్ట్‌వాచ్‌లో పర్సనలైజ్డ్ వాచ్ ఫేసెస్ ఉంటాయి. బ్యాటరీ లెవెల్, హార్ట్ రేట్, స్టెప్ కౌంట్, క్యాలరీ కౌంట్, టెంపరేచర్, టైమ్, డేట్, డే లాంటివన్నీ రియల్‌మీ స్మార్ట్‌వాచ్‌లో చూడొచ్చు. క్రికెట్, యోగా, టేబుల్ టెన్నిస్, బాస్కెట్ బాల్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, ఏరోబిక్ లాంటి 14 స్పోర్ట్స్ మోడ్స్‌ను ట్రాక్ చేసే ఇంటెలిజెంట్ యాక్టివిటీ ట్రాకర్ కూడా ఉంటుంది. 24 గంటలు పనిచేసే హెల్త్ అసిస్టెంట్ రియల్ టైమ్‌లో హార్ట్ రేట్‌ను ట్రాక్ చేస్తుంది. బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటర్ కూడా ఉంటుంది.

ఈ స్మార్ట్‌వాచ్‌తో ఇన్‌కమింగ్ కాల్స్ రిసీవ్ లేదా రిజెక్ట్ చేయొచ్చు. వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, జీమెయిల్, ఎస్ఎంఎస్, ఇన్‌స్టాగ్రామ్ నోటిఫికేషన్లను స్మార్ట్ నోటిఫికేషన్స్ ద్వారా చూడొచ్చు. రియల్‌మీ లింగ్ యాప్‌ను ఈ డివైజ్ సపోర్ట్ చేస్తుంది. వాచ్ బాడీ బ్లాక్ కలర్‌లో ఉంటుంది. స్ట్రాప్స్ బ్లూ, రెడ్, గ్రీన్ కలర్స్‌లో ఉంటాయి. లాంఛింగ్ సమయంలో క్లాసిక్ స్ట్రాప్‌లో రియల్‌మీ స్మార్ట్‌వాచ్ ఉంటుంది. వీటితో పాటు త్వరలో ఫ్యాషన్ స్ట్రాప్ కూడా రిలీజ్ చేస్తామని కంపెనీ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

Jio New Plans: ఎక్కువ 4జీ డేటాతో జియో ప్రకటించిన ప్లాన్స్‌ ఇవే

Redmi: ఈ మూడు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని పెంచిన షావోమీ

Prepaid Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ బెస్ట్ ప్లాన్స్ ఎంచుకోండి ఇలా
Published by: Santhosh Kumar S
First published: May 20, 2020, 5:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading