Realme X7 Max 5G: రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది

Realme X7 Max 5G: రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది (image: Realme India)

Realme X7 Max 5G | రియల్‌మీ మరో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయబోతోంది. రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ విశేషాలు తెలుసుకోండి.

  • Share this:
    రియల్‌మీ ఫ్యాన్స్‌కు శుభవార్త. ఎక్స్7 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేయబోతోంది రియల్‌మీ. మే 31 మధ్యాహ్నం 12.30 గంటలకు రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ కానుంది. రియల్‌మీ నుంచి రాబోతున్న మరో 5జీ స్మార్ట్‌ఫోన్ ఇది. అయితే అంతకన్నా ముందే ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్‌ని రియల్‌మీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికీ గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ అయిన జీటీ నియో రీబ్రాండెడ్ వేరియంటే రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్. కాబట్టి స్పెసిఫికేషన్స్ తెలిసినవే. రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో డైమెన్సిటీ 1200 5జీ ప్రాసెసర్, సూపర్ అమొలెడ్ ఫుల్ స్క్రీన్, 120Hz డిస్‌ప్లే, 50వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64 మెగాపిక్సెల్ Sony IMX682 సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ధరలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.27,999 ఉంటుందని అంచనా. ఇది 8జీబీ+128జీబీ వేరియంట్ ధర. దీంతో పాటు 12జీబీ+256జీబీ వేరియంట్ కూడా ఉంది. ఈ వేరియంట్ ధర రూ.30,999 ఉంటుందని అంచనా.

    ఇక రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్‌మీ స్మార్ట్ టీవీ 4కే కూడా ఇండియాలో మే 31న లాంఛ్ కానుంది. 43 అంగుళాలు, 50 అంగుళాల్లో రియల్‌మీ స్మార్ట్ టీవీ 4కే ఇండియాకు వస్తోంది.

    Realme X50 Pro 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.17,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు ఇవే

    Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్


    రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.3 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్ స్క్రీన్, 120Hz డిస్‌ప్లే
    ర్యామ్: 8జీబీ, 12జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ
    ప్రాసెసర్: డైమెన్సిటీ 1200 5జీ
    రియర్ కెమెరా: 64 మెగాపిక్సెల్ Sony IMX682 సెన్సార్‌ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్
    ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 4,500ఎంఏహెచ్, 50వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ 5జీ సిమ్ సపోర్ట్
    కలర్స్: మెర్క్యురీ సిల్వర్, ఆస్టరాయిడ్ బ్లాక్, మిల్కీ వే
    ధర:
    8జీబీ+128జీబీ- రూ.27,999
    12జీబీ+256జీబీ- రూ.30,999
    Published by:Santhosh Kumar S
    First published: