Realme Smart TV 4K: రియల్​మీ నుంచి మరో స్మార్ట్‌టీవీ... ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే

Realme Smart TV 4K: రియల్​మీ నుంచి మరో స్మార్ట్‌టీవీ... ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే (image: Realme)

Realme Smart TV 4K | రియల్‌మీ మరో స్మార్ట్ టీవీని ఇండియన్ మార్కెట్‌లో లాంఛ్ చేయనుంది. 43 అంగుళాల 4కే టీవీని పరిచయం చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
ప్రముఖ ఎలక్ట్రానిక్​ ఉత్పత్తుల తయారీ సంస్థ రియల్​మీ స్మార్ట్​ఫోన్లలోనే కాదు, స్మార్ట్​టీవీ మార్కెట్​లోనూ దూసుకుపోతోంది. రియల్​మీ కొత్తగా స్మార్ట్​ టీవీ 4కే ను భారత మార్కెటోకి విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. మే 31న దీన్ని లాంచ్​ చేయనుంది. ఈ సరికొత్త 43 అంగుళాల స్మార్ట్​టీవీని రియల్​ ఎక్స్ 7 మాక్స్ 5 జి స్మార్ట్​ఫోన్​తో కలిపి ఒకేసారి విడుదల చేయనుంది. రాబోయే రియల్​మీ స్మార్ట్ టివి 4 కె డాల్బీ విజన్‌కు సపోర్ట్​ ఇస్తుంది. గూగుల్ అసిస్టెంట్​ సహాయంతో ఈ టీవీని నేరుగా -హోమ్ అప్లియాన్సెస్​కు కనెక్ట్​ చేసి కంట్రోల్​ చేయవచ్చు. ఆడియో పరంగా చూస్తే, రియల్‌మీ 4 కె టివిలో డాల్బీ అట్మోస్ సపోర్ట్​తో కూడిన క్వాడ్- స్పీకర్ సిస్టమ్‌ను అందించింది. ఇది 24W ఆడియో అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని మే మొదటి వారంలోనే ప్రారంభించాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా లాంచింగ్​ కార్యక్రమాన్ని వాయిదా వేసింది.

Realme X7 Max 5G: రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది

Realme X50 Pro 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.17,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు ఇవే

మే 31న భారత మార్కెట్​లోకి


ప్రస్తుతం, రియల్‌మీ ఎస్‌ఎల్‌ఈడి 4 కె స్మార్ట్ టీవీ భారత మార్కెట్​లో 55 అంగుళాల స్క్రీన్‌తో లభిస్తుంది. ఇది రూ. 43,999 ధర వద్ద అందుబాటులో ఉంది. అయితే, విడుదలకు సిద్ధంగా ఉన్న 43 అంచుల స్మార్ట్​టీవీలో కూడా ఎల్​ఈడీ ప్యానెల్​ ఉంటుందా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. రియల్‌మీ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న 43 అంగుళాల స్మార్ట్ టీవీలో అద్భుతమైన ఫీచర్లను చేర్చింది. ఈ మోడల్‌లో వై-ఫై, బ్లూటూత్, మూడు హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు, రెండు యుఎస్‌బి పోర్ట్‌లు, ఒక లాన్ పోర్ట్, ఎవి పోర్ట్ వంటివి అందించింది. భారత మార్కెట్​లో ఇది ప్రస్తుతం రూ .24,999 ధర వద్ద లభించనుంది.

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్

Jio Plans: జియో ఫోన్ వాడుతున్నారా? రూ.39 నుంచి లభించే రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

రియల్​మీ స్మార్ట్​టీవీతో పాటు విడులయ్యే రియల్​మీ ఎక్స్ 7 మాక్స్ 5 జి స్మార్ట్​ఫోన్​లో కూడా అద్భుతమైన ఫీచర్లను చేర్చింది. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 SoC ప్రాసెసర్​ అందించనుంది. ఇది రియల్‌మీ జిటి నియోకి రీబ్రాండ్​గా వస్తోన్న ఈ స్మార్ట్​ఫోన్​ చైనాలో CNY 1,799 (సుమారు రూ .20,100) ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. లీకైన ఫీచర్ల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్​లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.43-అంగుళాల ఫుల్​ -హెచ్‌డి + అమోలేడ్ డిస్‌ప్లేను ఆశించవచ్చు. ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌లో 64 మెగాపిక్సెల్ మెయిన్​ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ -యాంగిల్ షూటర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా వంటివి ఉండనున్నాయి. ఇక, ఫోన్​ ముందు భాగంలో, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ప్రత్యేకంగా 16 మెగాపిక్సెల్ షూటర్‌ కెమెరాను కూడా అందించనుంది. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వేస్తే.. దీనిలో వై-ఫై 6, బ్లూటూత్ వి 5.1, 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చని సమాచారం. ఇక, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ స్మార్ట్​ఫోన్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​తో రానుంది.
Published by:Santhosh Kumar S
First published: