హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme: రియల్‌మీ నుంచి గుడ్ న్యూస్... ఏప్రిల్ 21న రెండు కొత్త ఫోన్ల రిలీజ్

Realme: రియల్‌మీ నుంచి గుడ్ న్యూస్... ఏప్రిల్ 21న రెండు కొత్త ఫోన్ల రిలీజ్

Realme: రియల్‌మీ నుంచి గుడ్ న్యూస్... ఏప్రిల్ 21న రెండు కొత్త ఫోన్ల రిలీజ్
(ప్రతీకాత్మక చిత్రం)

Realme: రియల్‌మీ నుంచి గుడ్ న్యూస్... ఏప్రిల్ 21న రెండు కొత్త ఫోన్ల రిలీజ్ (ప్రతీకాత్మక చిత్రం)

Realme Narzo Series | రియల్‌మీ నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేసే తేదీని ప్రకటించింది కంపెనీ. గత నెలలో నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

  రియల్‌మీ ఫ్యాన్స్‌కు శుభవార్త. రియల్‌మీ నుంచి నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ కాబోతున్నాయి. ఏప్రిల్ 21 మధ్యాహ్నం 12.30 గంటలకు రియల్‌మీ నార్జో 10, రియల్‌మీ నార్జో 10ఏ స్మార్ట్‌ఫోన్లను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఈ రెండు ఫోన్లు మార్చి 26న రిలీజ్ కావాల్సి ఉండగా, కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ఈవెంట్‌ను వాయిదా వేసింది కంపెనీ. ఏప్రిల్ 20న లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఉండటంతో రియల్‌మీ ఆన్‌లైన్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 21న రియల్‌మీ నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేయనుంది. రియల్‌మీ నుంచి ఇప్పటికే ప్రో, ఎక్స్, యూ, సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. వాటితో పాటు నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రానున్నాయి. రియల్‌మీ నార్జో 10, రియల్‌మీ నార్జో 10ఏ మొబైల్స్ షావోమీకి చెందిన పోకో ఎఫ్1, పోకో ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్లకు పోటీ ఇస్తాయని భావిస్తున్నారు.

  రియల్‌మీ నార్జో 10 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  డిస్‌ప్లే: 6.5 అంగుళాల హెచ్‌డీ+

  ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ

  ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ80

  రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా

  ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్

  రియల్‌మీ నార్జో 10ఏ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  డిస్‌ప్లే: 6.5 అంగుళాల హెచ్‌డీ+

  ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ

  ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ70

  రియర్ కెమెరా: 12 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా

  ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్

  ఇవి కూడా చదవండి:

  WhatsApp: వాట్సప్‌లో వీడియోకాల్స్ చేసేవారికి గుడ్ న్యూస్...

  JioPOS Lite App: ఈ జియో యాప్‌తో డబ్బు సంపాదించండి ఇలా

  Prepaid Plans: రూ.200 లోపు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Realme, Realme Narzo, Realme UI, Smartphone, Smartphones, Technology

  ఉత్తమ కథలు