• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • REALME TO LAUNCH REALME C20 REALME C21 AND REALME C25 SMARTPHONES ON APRIL 8 KNOW SPECIFICATIONS SS

Realme: రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... ఒకేసారి 3 స్మార్ట్‌ఫోన్లు లాంఛింగ్

Realme: రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... ఒకేసారి 3 స్మార్ట్‌ఫోన్లు లాంఛింగ్

Realme: రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... ఒకేసారి 3 స్మార్ట్‌ఫోన్లు లాంఛింగ్ (image: Realme India)

Realme C Series | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.10,000 లోపేనా? ఏప్రిల్ 8న మూడు స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేయనుంది రియల్‌మీ.

  • Share this:
    రియల్‌మీ ఫ్యాన్స్‌కు శుభవార్త. ఏప్రిల్ 8 తేదీ గుర్తు పెట్టుకోండి. ఆరోజు ఒకేసారి మూడు స్మార్ట్‌ఫోన్లను ఇండియాలో రిలీజ్ చేయబోతోంది రియల్‌మీ. సీ సిరీస్‌లో ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ కాబోతున్నాయి. రియల్‌మీ సీ20, రియల్‌మీ సీ21, రియల్‌మీ సీ25 మోడల్స్‌ని పరిచయం చేయబోతోంది కంపెనీ. ఈ మూడు స్మార్ట్‌ఫోన్ల ఫీచర్స్ వేర్వేరుగా ఉండబోతున్నాయి. ఇవన్నీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్సే. ఈ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన కొన్ని ఫీచర్స్‌ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది రియల్‌మీ. అయితే ధర ఎంత ఉంటుందన్న సంగతి ఇంకా తెలియదు. రియల్‌మీ సీ20, రియల్‌మీ సీ21, రియల్‌మీ సీ25 స్మార్ట్‌ఫోన్స్ ఏఏ వేరియంట్లలో రిలీజ్ కాబోతున్నాయో తెలియదు. మరి ఏఏ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకోండి.


    రియల్‌మీ సీ25 ఫీచర్స్ చూస్తే ఇందులో 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 18వాట్ టైప్ సీ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ ప్రాసెసర్ ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. మీడియాటెక్ హీలియో జీ70 గేమింగ్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6.5 అంగుళాల భారీ డిస్‌ప్లే, 13 మెగాపిక్సెల్ ఏఐ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. కెమెరాలో సూపర్ నైట్‌స్కేప్, పోర్ట్‌రైట్ మోడ్, మ్యాక్రో లెన్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వాటరీ బ్లూ, వాటరీ గ్రే కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది.

    Realme 8 Pro: రూ.17,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.1,499 ధరకే కొనండి... ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వివరాలివే

    Samsung: సాంసంగ్ గెలాక్సీ ఫోన్ వాడుతున్నవారికి గుడ్ న్యూస్... ఈ సర్వీస్ ఉచితం


    ఇక రియల్‌మీ సీ20, రియల్‌మీ సీ21 విషయానికి వస్తే వీటిలో 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ ఏఐ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. కెమెరాలో పోర్ట్‌రైట్ మోడ్, సూపర్ నైట్‌స్కేప్, క్రోమా బూస్ట్, హెచ్‌డీఆర్ మోడ్, 1080P వీడియో రికార్డింగ్, స్లో-మో వీడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో హెచ్‌డీ+ భారీ డిస్‌ప్లే కూడా ఉంటుంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియల్‌మీ సీ20 కూల్ బ్లూ, కూల్ గ్రే కలర్స్‌లో, రియల్‌మీ సీ21 క్రాస్ బ్లూ, క్రాస్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తాయి.

    POCO X3: పోకో ఎక్స్3 ధర తగ్గింది... కొత్త రేటు ఎంతంటే

    Oppo A54: ఒప్పో ఏ54 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... భారీ బ్యాటరీతో పాటు మరెన్నో ప్రత్యేకతలు

    రియల్‌మీ సీ20, రియల్‌మీ సీ21, రియల్‌మీ సీ25 స్మార్ట్‌ఫోన్లు ఏప్రిల్ 8 మధ్యాహ్నం 12.30 గంటలకు లాంఛ్ అవుతాయి. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్లను కొనొచ్చు. ధరలు ఎంత ఉంటాయో తెలుసుకోవాలంటే ఏప్రిల్ 8 వరకు ఎదురుచూడాల్సిందే.
    Published by:Santhosh Kumar S
    First published: