Realme: రియల్‌మీ ఇండియా కీలక నిర్ణయం.. భారత్‌లో తయారైన స్మార్ట్‌ఫోన్లు నేపాల్‌కు ఎగుమతి

(image: Realme India)

భారత ప్రభుత్వం చేపట్టిన ‘మేకిన్​ ఇండియా’ కార్యక్రమంతో ఇది సాకారమైంది. తాజాగా చైనాకు చెందిన స్మార్ట్​బ్రాండ్​ రియల్​మీ భారత్​లో స్మార్ట్​ఫోన్​, ఇతర ఎలక్ట్రానిక్​ ఉత్పత్తులను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించింది.

  • Share this:
కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత్​ ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతుంది. దీంతో విదేశీ కంపెనీలు సైతం ఇక్కడే తమ రీసెర్చ్​ అండ్​ మాన్యుఫాక్చరింగ్​ సెంటర్లను నెలకొల్పుతున్నాయి. ఇక్కడ తయారైన స్మార్ట్​ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. దీంతో ఇతర దేశాల నుంచి స్మార్ట్​ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి.. ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్​ చేరుకుంది. భారత ప్రభుత్వం చేపట్టిన ‘మేకిన్​ ఇండియా’ కార్యక్రమంతో ఇది సాకారమైంది. తాజాగా చైనాకు చెందిన స్మార్ట్​బ్రాండ్​ రియల్​మీ భారత్​లో స్మార్ట్​ఫోన్​, ఇతర ఎలక్ట్రానిక్​ ఉత్పత్తులను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత మూడవ త్రైమాసికం నుంచి పొరుగునే ఉన్న నేపాల్‌కు 'మేక్ ఇన్ ఇండియా' స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా వేగంగా తమ సేవలను విస్తరించాలని యోచిస్తున్న రియల్​మీ.. 2022 నాటికి నేపాల్​లోనూ టాప్ బ్రాండ్​గా స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే, ఇప్పుడు స్మార్ట్​ఫోన్లను ఎగుమతి చేసి.. తర్వాతి దశల్లో టీవీలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ ఆఫ్ థింగ్స్​ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని యోచిస్తోంది.

దీనిపై రియల్​మీ ఇండియా సిఈఓ మాధవ్ సేత్ మాట్లాడుతూ ‘‘మా బ్రాండ్​ భారతదేశంలో గొప్ప విజయాన్ని అందుకుంది. తదుపరి మా లక్ష్యం పొరుగునే ఉన్న నేపాల్‌. అక్కడ కూడా ఇదే విధమైన విజయాన్ని అందుకుంటామని ఆశిస్తున్నాం. వినూత్న ఉత్పత్తులను తక్కువ ధరలోనే అందించడం, సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవడం మా బ్రాండ్​ ప్రత్యేకత. ఇదే మార్కెట్​ స్ట్రాటజీతో 2022 నాటికి నేపాల్‌లోని టాప్ 2 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని తెలిపారు.

భారత స్మార్ట్​ఫోన్​ మార్కెట్లో నాలుగో స్థానం..
నేపాల్‌ను అనువైన మార్కెట్‌గా భావిస్తుంది రియల్‌మీ. అందుకే, బడ్జెట్​ ధరలోనే స్మార్ట్​ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చి అక్కడ పాగా వేయాలని ప్రణాళికలు రచిస్తోంది. రియల్​మీ ప్రస్తుతం భారత్​లో 14.6 శాతం వాటా కలిగి ఉంది. దీంతో టాప్​ స్మార్ట్​ఫోన్​ బ్రాండ్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ముగిసిన రెండో త్రైమాసికంలో 23 శాతం వాటాతో భారతదేశంలో ప్రముఖ 5G స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం, భారతదేశంలో 50 మిలియన్ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు జరిపిన టాప్​ బ్రాండ్ రియల్​మీ రికార్డుకెక్కింది.
Published by:Krishna Adithya
First published: