రియల్మీ మూడో యానివర్సరీ సేల్ మొదలైంది. ఎప్పట్లాగే స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది రియల్మీ. ఈ సేల్ 2021 జూన్ 8 వరకు కొనసాగుతుంది. రియల్మీ అందించే డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. గరిష్టంగా రూ.1,000 డిస్కౌంట్ పొందొచ్చు. రియల్మీ మూడో యానివర్సరీ సేల్‌లో భాగంగా రియల్మీ వెబ్సైట్లోనే కాదు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా డిస్కౌంట్ ఆఫర్స్ పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20,000 కన్నా ఎక్కువ విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఈఎంఐ ద్వారా కొనేవారికి అదనంగా రూ.500 తగ్గింపు లభిస్తుంది. రీటైల్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఆఫర్స్ లభిస్తాయి.
Realme X7 Max 5G: కాసేపట్లో రియల్మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ సేల్... ఆఫర్ వివరాలు ఇవే
WhatsApp: వాట్సప్‌లో సమస్యలున్నాయా? ఈయనకు కంప్లైంట్ చేయండి
Elevate your gadget game with our smart range of AIoT products at exciting prices. Enjoy celebratory offers worth ₹35 Crore and up to 40% off at the #3rdrealmeAnniversary Sale, starting at 00:00 Hrs Midnight from 4th June. pic.twitter.com/jQqhdPz13A
— realme TechLife (@realmeTechLife) June 2, 2021
ఆఫర్స్ వివరాలు చూస్తే రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.17,000 డిస్కౌంట్, రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్‌పై రూ.6,000 డిస్కౌంట్, రియల్మీ ఎక్స్7 ప్రో 5జీ మోడల్‌పై రూ.3,000 డిస్కౌంట్, రియల్మీ ఎక్స్7 5జీ మోడల్‌పై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. వీటితో పాటు రియల్మీ నార్జో 30 ప్రో 5జీ, రియల్మీ నార్జో 30ఏ, రియల్మీ నార్జో 20, రియల్మీ నార్జో 20 ప్రో, రియల్మీ 8, రియల్మీ 8 ప్రో, రియల్మీ 8 5జీ లాంటి మోడల్స్‌పైనా ఆఫర్స్ ఉన్నాయి. ఇక రియల్మీ స్మార్ట్ టీవీ 4కే లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. సేల్ మొదలైంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.2,000 తగ్గింపు పొందొచ్చు. 43 అంగుళాల టీవీ ధర రూ.29,999 కాగా, 50 అంగుళాల టీవీ ధర రూ.39,999. ఇతర రియల్మీ స్మార్ట్ టీవీలపైనా డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి.
Redmi Note 10 Series: రెడ్మీ నోట్ 10 సిరీస్‌లో 4 స్మార్ట్ఫోన్లు... వీటిలో ఏది బెస్ట్?
Mi 11 Ultra: ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూడాల్సిందే... సేల్ మరింత ఆలస్యం
స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలు మాత్రమే కాదు ఇతర ప్రొడక్ట్స్ పైనా డిస్కౌంట్స్ ఉన్నాయి. రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో, రియల్మీ స్మార్ట్‌వాచ్ ఎస్, రియల్మీ స్మార్ట్‌వాచ్ ఎస్ ప్రో, రియల్మీ పవర్ బ్యాంక్, రియల్మీ బడ్స్ వైర్లెస్, రియల్మీ ఇటూత్బ్రష్, రియల్మీ స్మార్ట్ ప్లగ్ లాంటి ప్రొడక్ట్స్ పైనా ఆఫర్స్ పొందొచ్చు. రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో ధర రూ.500 తగ్గింది. రియల్మీ బడ్ క్యూ ధర రూ.200 తగ్గింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, Realme, Realme Narzo, Realme UI, Smart TV, Smartphone, Smartphones