రీసెంట్గా మీడియాటెక్ డైమెన్సిటీ 1080 (MediaTek Dimensity 1080) ప్రాసెసర్ లాంఛ్ అయిన విషయం తెలిసిందే. ఈ కొత్త ప్రాసెసర్‌తో రెడ్మీ నోట్ 12 బేస్ మోడల్ రిలీజ్ అవుతుందని కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్మీ (Realme) కూడా డైమెన్సిటీ 1080 చిప్సెట్తో అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తామని అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాదిలోనే ఈ నయా ప్రాసెసర్‌తో ఒక ఫోన్ రిలీజ్ చేస్తామని రియల్మీ ఇండియా సీఈఓ మాధవ్ సేథ్ (Madhav Sheth) ట్వీట్ చేశారు. సీఈఓ మాధవ్ సేథ్ ఈ డైమెన్సిటీ 1080-పవర్డ్ రియల్మీ డివైజ్ గురించి పెద్దగా వివరాలేవీ వెల్లడించలేదు. దాని పేరు కూడా తెలపలేదు. లాంఛ్ టైమ్ఫ్రేమ్నూ అందించలేదు. త్వరలో ఈ మొబైల్ గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ట్వీట్ లైక్స్‌తో కన్ఫర్మేషన్
అప్‌కమింగ్ Realme 10 Pro+ 5G ఫోన్లో MediaTek Dimensity 1080 ప్రాసెసర్ ఇవ్వవచ్చని టెక్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. Dimensity 1080 అనేది Dimensity 920కి సక్సెసర్‌గా వచ్చింది. అక్టోబర్ 11న రియల్మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ ఒక ట్వీట్ చేస్తూ ఆ ట్వీట్‌కి 1080 లైక్స్ లేదా అంతకంటే ఎక్కువ వస్తే, రివార్డ్‌గా కంపెనీ ఈ ఏడాది డైమెనిటీ 1080 పవర్‌తో ఒక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తుందని వెల్లడించారు. కాగా ఇప్పటికే మాధవ్ ట్వీట్‌కు 2 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. దీనితో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 పవర్డ్ రియల్మీ ఫోన్ లాంఛ్ కన్ఫామ్ అయ్యింది. డిసెంబర్ నెలలో ఈ మొబైల్ విడుదల కావచ్చు. ఆలోగా దీని గురించి పూర్తి వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది.
32 inch Smart TV: 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.8,999 మాత్రమే... ఆఫర్ వివరాలివే
రూ.25 వేలలోపు ధర!
కొద్ది రోజుల క్రితం మీడియాటెక్ సంస్థ డైమెన్సిటీ 1080ని 5G చిప్‌సెట్‌గా తీసుకొచ్చింది. ఈ డైమెన్సిటీ 1080 చిప్ Imagiq ISPతో 200MP కెమెరా వరకు ఇమేజ్ డేటాను హ్యాండిల్ చేస్తుంది. ఇది హార్డ్‌వేర్ యాక్సిలరేటెడ్ HDR వీడియో, 4K రిజల్యూషన్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. గ్రాఫిక్స్ కోసం ఇందులో Mali-G68 GPU ఆఫర్ చేశారు. ఈ ప్రాసెసర్ 6 నానోమీటర్ ప్రాసెస్‌పై బిల్డ్ చేశారు. ఇది అప్‌గ్రేడ్ చేసిన ఆక్టా-కోర్ CPUతో వస్తుంది. ఇది రెండు Arm Cortex-A78 CPU కోర్లతో 2.6GHz వరకు క్లాక్ స్పీడ్‌తో వర్క్ అవుతుంది. ఇది Arm Mali-G68 గ్రాఫిక్స్ యూనిట్‌తో వస్తుంది.
ఈ చిప్ Sub-6GHz 5G నెట్వర్క్.. Wi-Fi 6 కనెక్టివిటీకి మద్దతు ఇవ్వగలదని మీడియాటెక్ కంపెనీ తెలిపింది. ప్రాసెసర్‌లో ఇంటర్నల్ AI ప్రాసెసింగ్ యూనిట్ 3.0తో హైపర్ఇంజన్ 3.0 వంటి గేమింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది యూజర్లు 5G- ఎనేబుల్డ్ SIMలో గేమ్‌లు ఆడటానికి హెల్ప్ అవుతుంది. ఈ చిప్ LPDDR5 మెమరీ, డ్యూయల్-లేన్ UFS 3.1 స్టోరేజ్‌కి కూడా మద్దతు ఇస్తుంది. ఈ చిప్‌తో వచ్చే ఫోన్ ధర రూ.25 వేల లోపు ఉండొచ్చని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Realme, Smartphone