రియల్మీ నుంచి ఇటీవల 7 సిరీస్‌లో రియల్మీ 7, రియల్మీ 7 ప్రో స్మార్ట్ఫోన్లు రిలీజైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ జరిగింది. తొలి సేల్‌లో రియల్మీ 7 స్మార్ట్ఫోన్లు ఎన్ని అమ్ముడు పోయాయో తెలుసా? మొత్తం 1,80,000 యూనిట్స్ అమ్మింది రియల్మీ. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్మీ అధికారిక వెబ్సైట్లో ఈ సేల్ జరిగింది. ఈ ఫోన్ కొనాలనుకునే కస్టమర్లకు కొన్ని నిమిషాల్లోనే ఔట్ ఆఫ్ స్టాక్ కనిపించింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో కొన్నవారికి 5% డిస్కౌంట్ కూడా లభించింది. మళ్లీ నెక్స్ట్ సేల్ సెప్టెంబర్ 17న జరగనుంది. ఇక రియల్మీ 7 స్మార్ట్‌ఫోన్‌తో పాటు రిలీజైన రియల్మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ సేల్ సెప్టెంబర్ 14 మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది.
Smartphone Hack: మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయిందా? తెలుస్తుంది ఇలా
Big Battery Smartphones: స్మార్ట్‌ఫోన్‌లో ఛార్జింగ్ ఉండట్లేదా? భారీ బ్యాటరీ ఉన్న 8 బెస్ట్ ఫోన్స్ ఇవే
రియల్మీ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ డార్ట్ ఛార్జ్ సపోర్ట్ లాంటి విశేషాలున్నాయి. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్ ఉన్నాయి. రియర్ కెమెరా 64+8+2+2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ కెపాసిటీ 5000ఎంఏహెచ్. 30వాట్ డార్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 64 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మిస్ట్ వైట్, మిస్ట్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది.రియల్మీ 7 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,999. ఈ ఫోన్ కొనాలంటే మళ్లీ సెప్టెంబర్ 17 వరకు ఆగాల్సిందే. ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఈ ఫోన్ కొనొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:September 11, 2020, 18:01 IST