Home /News /technology /

REALME SMARTWATCH DIZO WATCH S AFFORDABLE SMARTWATCH LAUNCHED IN INDIA AND HERE PRICE SPECIFICATIONS DETAILS GH SRD

Realme Smartwatch: ఇండియాలో రియల్‌మీ ‘డిజో వాచ్ S’ స్మార్ట్‌వాచ్‌ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలు..

Realme Smart Dizo Watch S

Realme Smart Dizo Watch S

Realme Smartwatch: రియల్‌మీ టెక్‌లైఫ్ ఎకోసిస్టమ్ బ్రాండ్ ‘డిజో’ పేరుతో కొత్త స్మార్ట్‌వాచ్‌ను ఇండియాలో విడుదల చేసింది. దీంతో స్మార్ట్ వాచ్ సెగ్మెంట్‌లో తన పరిధిని మరింత విస్తృతం చేసుకుంది.

రియల్‌మీ టెక్‌లైఫ్ ఎకోసిస్టమ్ బ్రాండ్ ‘డిజో’ పేరుతో కొత్త స్మార్ట్‌వాచ్‌ను ఇండియాలో విడుదల చేసింది. దీంతో స్మార్ట్ వాచ్ సెగ్మెంట్‌లో తన పరిధిని మరింత విస్తృతం చేసుకుంది. పెద్ద డిస్‌ప్లే, లాంగ్ లైఫ్ బ్యాటరీ, SpO2 మానిటరింగ్, 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లతో Dizo సరసమైన స్మార్ట్‌వాచ్‌గా మార్కెట్‌లోకి లాంచ్ అయింది.

* డిజో వాచ్ S ధరలు
భారతదేశంలో డిజో వాచ్ S ధర రూ. 2,999 అయినప్పటికీ ఆఫర్‌లో భాగంగా రూ.1,999కి అందుబాటులో ఉండనుంది. డిజో వాచ్ S మోడల్‌ను ఏప్రిల్ 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనున్నారు.

* ఫీచర్లు
డిజో వాచ్ S 1.57-అంగుళాల డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇది 550 నిట్స్ మ్యాగ్జిమం బ్రైట్‌నెస్‌తో కస్టమర్లను అట్రాక్ట్ చేసేలా ఉంది. 150+ వాచ్ ఫేస్‌లతో ఇది అందుబాటులోకి రానుంది. వాచ్ పట్టీలను మార్చుకునేలా సిలికాన్‌తో తయారు చేశారు. సిల్వర్ బ్లూ, గోల్డెన్ పింక్, క్లాసిక్ బ్లాక్ రంగుల్లో డిజో వాచ్ S అందుబాటులోకి రానున్నాయి.

డిజో వాచ్ S స్మార్ట్‌వాచ్‌లో 110 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఇందులో రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ఎలిప్టికల్, యోగా, హాకీ, ఫుట్‌బాల్, గుర్రపు స్వారీ ఇలా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ వాచ్ బ్లడ్ ఆక్సిజన్ (SpO2) స్థాయిలను మానిటర్ చేస్తుంది. ఆక్సిజన్ తగ్గితే యూజర్లను హెచ్చరిస్తుంది.

ఇది 24x7 హార్ట్ రేటును, నిద్రను కూడా పర్యవేక్షిస్తుంది. మహిళల్లో పీరియడ్స్ డేట్స్‌ను ట్రాక్ చేసి అలర్ట్ ఇస్తుంది. డిజో వాచ్ S.. IP68 రేటింగ్‌ డస్ట్ అండ్ వాటర్ ప్రూప్‌తో వస్తుంది. వాతావరణం, కాల్ నోటిఫికేషన్, మెసేజ్ రిమైండర్, టైమర్, అలారం రిమైండర్, స్టెప్ గోల్ కంప్లీషన్ రిమైండర్‌తో సహా రోజంతా డేటాను నిరంతరాయంగా అందిస్తుంది.

ఇది కూడా చదవండి : పాల కల్తీని గుర్తించే సరికొత్త పద్ధతి.. అందుబాటులోకి కొత్తరకం డిప్‌స్టిక్‌.. వివరాలివే..!

ఈ స్మార్ట్‌వాచ్‌లో బ్లూటూత్ v5.0 కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 5.0 అండ్ iOS 9.0 అంతకంటే ఎక్కువ నడుస్తున్న స్మార్ట్‌ఫోన్‌లతో ఈ స్మార్ట్ వాచ్‌ను సరిపోల్చవచ్చు. Dizo Watch S 200 mAh బ్యాటరీతో రూపొందించారు. ఒక సారి చార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. అలాగే 20 రోజుల వరకు స్టాండ్‌బై సమయాన్ని అందించగలదు.

ఇది కూడా చదవండి : అమెజాన్ లో అదిరే ఆఫర్.. రూ.9 వేలకే 50MP కెమెరా ఫోన్.. వివరాలివే

దీంతోపాటు మార్కెట్‌లో వివిధ బ్రాండ్‌ల స్మార్ట్ వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రధానంగా షియోమి రెడ్‌మి వాచ్‌... 1.4 అంగుళాల TFT LCD డిస్‌ప్లే, 320x320 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. హార్ట్‌రేట్, స్లీప్ మానిటరింగ్, స్విమ్మింగ్, ట్రెడ్‌మిల్, జీపీఎస్, అడ్వాన్స్‌డ్ హెల్త్‌ ట్రాకింగ్ సహా మొత్తం 11 రకాల స్పోర్ట్స్‌ మోడ్‌ ఫీఛర్లతో అందుబాటులో ఉంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Realme, Smart watch, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు