Home /News /technology /

REALME SMARTWATCH BUDGET SMARTWATCH WITH SUPER FEATURES REALME TECHLIFE WATCH S100 REVIEW GH EVK

Realme Smartwatch: సూపర్ ఫీచర్లతో వచ్చిన బడ్జెట్ స్మార్ట్‌వాచ్.. రియల్‌మీ టెక్‌లైఫ్ వాచ్ S100 రివ్యూ

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Realme Watch S100 | రియల్‌మీ ఇటీవల టెక్ లైఫ్ (TechLife) బ్రాండ్‌లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. రియల్‌మీ టెక్‌లైఫ్ వాచ్ ఎస్‌100 (Realme Watch S100) పేరుతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ స్మార్ట్ వాచ్ ఫీచర్స్ వివరాలు..

ఇంకా చదవండి ...
రియల్‌మీ (Realme) ఇటీవల టెక్ లైఫ్ (TechLife) బ్రాండ్‌లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. రియల్‌మీ టెక్‌లైఫ్ వాచ్ ఎస్‌100 (Realme Watch S100) పేరుతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ 1.69-అంగుళాల టచ్‌స్క్రీన్ కలర్ డిస్‌ప్లే, 12 రోజుల వరకు బ్యాటరీ లైఫ్, SpO2 సెన్సార్, స్కిన్ టెంపరేచర్ సెన్సార్‌, ఇతర ఫీచర్లతో రిలీజ్ అయింది. దీని ధర రూ. 2,500. ఈ స్మార్ట్‌వాచ్ రివ్యూ చూద్దాం.

డిస్‌ప్లే, డిజైన్
Realme Techlife Watch S100 డిజైన్ Realme Watch 2ను పోలి ఉంటుంది. ఇది 240×240 పిక్సెల్స్ రిజల్యూషన్‌ అందించే 1.69-అంగుళాల పెద్ద కలర్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. స్క్వేరిష్ డయల్‌కు అన్ని వైపులా సన్నని బెజెల్స్ ఉంటాయి. ఇది మెటాలిక్ ఫినిషింగ్‌తో వస్తుంది. వాచ్‌కి సైడ్ పవర్ బటన్ ఉంటుంది. ఇది పవర్, స్టాండ్‌బైని నియంత్రిస్తుంది.

Realme GT 2 Pro: అదిరిపోయే లుక్‌.. ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ అయిన రియల్‌మీ జీటీ 2 ప్రో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్

స్మార్ట్ వాచ్ టచ్‌స్క్రీన్ బాగా పనిచేస్తుంది. కానీ మీరు సన్ లైట్‌లో ఉన్నప్పుడు స్మార్ట్ వాచ్ బ్రైట్‌నెస్ కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. దీన్ని అడ్జెస్ట్ చేయడానికి వాచ్‌లో ఆటో-బ్రైట్‌నెస్ ఆప్షన్ లేదు. అంటే మీరు బయటకు వెళ్లినప్పుడు మాన్యువల్‌గా బ్రైట్‌నెస్ పెంచాలి. ఈ వాచ్ పెద్ద డయల్ పెద్ద ఫాంట్‌లో నోటిఫికేషన్‌లను స్పష్టంగా చూపిస్తుంది. దీని ద్వారా మెసేజ్‌లు, ఈమెయిల్స్ సులభంగా చదువుకోవచ్చు. మొత్తంమీద స్మార్ట్‌వాచ్ రోజంతా ధరించడానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే దీనికి ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ లేదు. ధర తక్కువగా ఉన్నందున ప్రీమియం పనితీరును ఆశించలేం.

Digital Currency: మార్కెట్‌లోకి కొత్త డిజిట‌ల్ క‌రెన్సీ.. ఎవ‌రు ప్ర‌వేశ పెడుతున్నారో తెలుసా..?

పర్ఫార్మెన్స్
రియల్‌మీ టెక్‌లైఫ్ వాచ్ S100 స్మార్ట్‌వాచ్ ఎన్నో ఫీచర్‌లతో వస్తుంది. హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ మానిటర్, SpO2 లెవల్ మానిటర్, యాక్సిలెరోమీటర్, పెడోమీటర్, బాడీ టెంపరేచర్ సెన్సార్ వంటి అనేక హెల్త్-ట్రాకింగ్ ఫీచర్‌లతో వస్తుంది. ఇవి కచ్చితమైన పనితీరును అందిస్తాయి. ఈ స్మార్ట్‌వాచ్‌లో వర్కౌట్‌లను ట్రాక్ చేయడానికి వివిధ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. వీటిలో అవుట్‌డోర్ రన్నింగ్, సైక్లింగ్, బ్యాడ్మింటన్, యోగా ట్రాకర్ వంటివి ఉన్నాయి. ఈ మోడ్‌లు మీ వ్యాయామాన్ని చాలా కచ్చితత్వంతో ట్రాక్ చేస్తాయి.

Google Doc: మ‌రింత సౌక‌ర్యంగా.. గూగుల్ డాక్స్‌లో స‌రికొత్త ఫీచ‌ర్స్‌


Realme Techlife Watch S100 బ్లూటూత్ 5.1 కనెక్టివిటీతో వస్తుంది. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ అయ్యి GPSను ఉపయోగించి.. మీ రన్నింగ్, వాకింగ్, సైకిల్ రైడ్‌లను ట్రాక్ చేస్తుంది. హెల్త్ ట్రాకింగ్ ఫీచర్‌లతో పాటు, Realme Techlife Watch S100లో 110కి పైగా వాచ్ ఫేస్‌లు కూడా ఉన్నాయి. Android, iOS ప్లాట్‌ఫారమ్‌లలో Realme Fit యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ వాచ్‌ను సెటప్ చేయడం ఇబ్బందిగా ఉందని యూజర్లు చెబుతున్నారు.

బ్యాటరీ సామర్థ్యం
రియల్‌మీ టెక్‌లైఫ్ వాచ్ S100.. 260mAh బ్యాటరీతో వస్తుంది. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే 12 రోజులు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. అయితే డివైజ్ వాడకంపై ఇది ఆధారపడి ఉంటుంది. స్మార్ట్‌వాచ్‌లో మాగ్నెటిక్ ఛార్జింగ్ డాక్ ఉంది. దీన్ని PC లేదా ల్యాప్‌టాప్ USB పోర్ట్‌లో ప్లగ్ చేయవచ్చు లేదా లో-పవర్ మోడ్‌లో పవర్ బ్యాంక్‌గా ఉపయోగించవచ్చు. ఈ వాచ్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 2 గంటలు పడుతుంది.

మొత్తంమీద వాచ్ S100 రూ. 2,499 ధర వద్ద లభిస్తున్న మంచి ఎంట్రీ లెవల్ స్మార్ట్‌వాచ్‌గా చెప్పుకోవచ్చు. ఎంట్రీ-లెవల్ ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే Realme Techlife Watch S100 మీకు బెస్ట్ ఆప్షన్.
Published by:Sharath Chandra
First published:

Tags: Latest Technology, Realme, Smart watch

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు