హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme 6: రేపే రియల్‌మీ 6 లాంఛింగ్... వారికి రియల్‌మీ బ్యాండ్ ఉచితం

Realme 6: రేపే రియల్‌మీ 6 లాంఛింగ్... వారికి రియల్‌మీ బ్యాండ్ ఉచితం

Realme 6: రేపే రియల్‌మీ 6 లాంఛింగ్... వారికి రియల్‌మీ బ్యాండ్ ఉచితం

Realme 6: రేపే రియల్‌మీ 6 లాంఛింగ్... వారికి రియల్‌మీ బ్యాండ్ ఉచితం

Realme 6 Series Launching | ఆన్‌లైన్ ఈవెంట్‌లో రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో స్మార్ట్‌ఫోన్లతో పాటు రియల్‌మీ ఫిట్‌నెస్ బ్యాండ్‌ని పరిచయం చేయనుంది కంపెనీ.

  కరోనా వైరస్ ప్రభావం స్మార్ట్‌ఫోన్ కంపెనీలపైనా చూపిస్తోంది. ఇప్పటికే మార్చి 12న జరగాల్సిన షావోమీ రెడ్‌మీ నోట్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల లాంఛింగ్ వాయిదా పడింది. మార్చిలో ఆన్ గ్రౌండ్ ఈవెంట్స్ నిర్వహించట్లేదని కంపెనీ ప్రకటించింది. లాంఛింగ్ ఆన్‌లైన్‌లోనే ఉంటుందని వివరించింది. కరోనా వైరస్ ఎఫెక్ట్ రియల్‌మీ 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల లాంఛింగ్ పైనా కనిపిస్తోంది. మార్చి 5న న్యూ ఢిల్లీలో రియల్‌మీ 6 సిరీస్ లాంఛింగ్ ఉన్నట్టు గతంలోనే ప్రకటించింది కంపెనీ. అయితే కరోనా వైరస్ ప్రభావంతో ఈ లాంఛింగ్ ఉంటుందా లేదా అన్న అనుమానాలు వచ్చాయి. అయితే న్యూ ఢిల్లీలో రియల్‌మీ ఫ్యాన్స్ మధ్య జరగాల్సిన ఈవెంట్‌ను కంపెనీ రద్దు చేసింది. అయితే ఆన్‌లైన్‌లో రియల్‌మీ 6 సిరీస్ లాంఛింగ్ ఉంటుందని ప్రకటించింది. అంటే న్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరగాల్సిన ఈవెంట్ ఆన్‌లైన్‌లో మాత్రమే జరుగుతుంది. మార్చి 5న రియల్‌మీ 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ అవుతాయి.

  రియల్‌మీ 6 సిరీస్ లాంఛింగ్ ఈవెంట్‌కు రియల్‌మీ ఫ్యాన్స్ రూ.599 చెల్లించి మరీ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో వారికి నిరాశ మిగిలింది. అయితే రీఫండ్‌తో పాటు టికెట్ బుక్ చేసుకున్న ప్రతీ ఒక్కరికి రియల్‌మీ బ్యాండ్ ఇస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అంటే ఈ ఈవెంట్ కోసం టికెట్ బుక్ చేసిన రియల్‌మీ ఫ్యాన్స్‌కు రూ.599 రీఫండ్‌తో పాటు రియల్‌మీ బ్యాండ్ ఉచితంగా లభించనుంది. ఇక లాంఛింగ్ విషయానికి వస్తే ఆన్‌లైన్ ఈవెంట్‌లో రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో స్మార్ట్‌ఫోన్లతో పాటు రియల్‌మీ ఫిట్‌నెస్ బ్యాండ్‌ని పరిచయం చేయనుంది కంపెనీ. రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్లకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

  రియల్‌మీ 6 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లలో అనేక ప్రత్యేకతలున్నాయి. రియల్‌మీ 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. అంతేకాదు... 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని రియల్‌మీ వెల్లడించింది. రియల్‌మీ 6 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్, 4,300 బ్యాటరీ, రియల్‌మీ 6 ప్రో మోడల్‌లో క్వాడ్ కెమెరా సెటప్, 20x జూమ్, 90Hz రిఫ్రెష్ రేట్, 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

  ఇవి కూడా చదవండి:

  WhatsApp Dark Mode: వాట్సప్‌లో డార్క్ మోడ్ వచ్చేసింది... సెట్టింగ్స్ మార్చండి ఇలా

  IRCTC: ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉన్నవాళ్లందరికీ ఈ వార్నింగ్

  SBI: కరెన్సీ నోట్లు పాడయ్యాయా? ఎస్‌బీఐలో ఫ్రీగా మార్చుకోండి ఇలా

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Realme, Realme UI, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు