Realme: ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు ఉన్నవారికి గుడ్ న్యూస్

Realme: ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు ఉన్నవారికి గుడ్ న్యూస్ (ప్రతీకాత్మక చిత్రం)

Realme VoWiFi Calling Feature | రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నవారికి వాయిస్ ఓవర్ వైఫై కాలింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఎలా వాడుకోవాలో తెలుసుకోండి.

  • Share this:
    మీరు రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? అయితే మీకు శుభవార్త. VoWiFi ఫీచర్‌ని అన్ని ఫోన్లకు రిలీజ్ చేసింది రియల్‌మీ. మీ స్మార్ట్‌ఫోన్‌లో సిమ్ కార్డు లేకపోయినా, మొబైల్ నెట్వర్క్ సిగ్నల్ సరిగ్గా లేకపోయినా వైఫై ద్వారా కాల్స్ చేయడానికి ఉపయోగపడేదే వాయిస్ ఓవర్ వైఫై-VoWiFi ఫీచర్. రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే VoWiFi ఫీచర్‌ని అధికారికంగా ప్రారంభించాయి. అయితే స్మార్ట్‌ఫోన్‌ ఈ ఫీచర్‌ని సపోర్ట్ చేస్తేనే వైఫై ద్వారా కాల్స్ చేయడం సాధ్యం. అన్ని స్మార్ట్‌ఫోన్లల్లో ఈ ఫీచర్ ఉండదు. కొన్నింటికి మాత్రమే ఉంటుంది. షావోమీతో పాటు రియల్‌మీ తమ స్మార్ట్‌ఫోన్లకు విడతల వారీగా ఈ ఫీచర్‌ను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పుడు రియల్‌మీ తమ కంపెనీ అన్ని స్మార్ట్‌ఫోన్లల్లో VoWiFi ఫీచర్ ఉన్నట్టు అధికారికంగా ప్రకటించాయి.

    VoWiFi ఫీచర్ ఉన్న రియల్‌మీ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...


    realme X2 Pro, realme X2, realme XT, realme X, realme 5 Pro, realme 3 Pro, realme 5, realme 5i, realme 5s, realme C2, realme 2, realme C1, realme 1, realme U1, realme 2 Pro, realme 3, realme 3i ఫోన్లల్లో VoWiFi ఫీచర్ వాడుకోవచ్చు. ఇందుకోసం ముందుగా మీ ఫోన్ అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత కొన్ని సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి Sim Card & Cellular Data పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత SIM Card & Mobile Data ఆప్షన్ క్లిక్ చేసి SIM 1 సెలెక్ట్ చేయాలి. సిమ్ 1 స్లాట్‌లో రిలయెన్స్ జియో లేదా ఎయిర్‌టెల్ సిమ్ కార్డు ఉంటేనే మీరు VoWiFi ఫీచర్ వాడుకోగలరు. ఈ ఫీచర్ వాడుకోవాలంటే మీరు వైఫై నెట్వర్క్‌కు కనెక్ట్ అయి ఉండాలి.

    ఇవి కూడా చదవండి:

    Disney+ Hotstar: హాట్‌స్టార్ వాడుతున్నారా? కొత్త ఛార్జీలు ఇవే

    Coronavirus: స్మార్ట్‌ఫోన్‌పై కరోనావైరస్ ఎన్ని రోజులు ఉంటుందంటే

    Reliance JioFiber: ఉచితంగా రిలయెన్స్ జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ 10ఎంబీపీఎస్ ప్లాన్
    Published by:Santhosh Kumar S
    First published: