రియల్‌మీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వరుసగా కొత్త ఫోన్స్ తీసుకొస్తున్న రియల్‌మీ... మరో మోడల్‌ను పరిచయం చేసింది. రియల్‌మీ ఎక్స్2 మోడల్‌ను ఇండియాలో ఆవిష్కరించింది కంపెనీ. ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30W VOOC FLASH CHARGE 4.0, సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. మూడు వేరియంట్లలో ఈ ఫోన్ రిలీజైంది. ప్రారంభ ధర రూ.16,999. రియల్‌మీ ఎక్స్2 సేల్ డిసెంబర్ 20 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అవుతుంది. రియల్‌మీ ఎక్స్2 స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్‌మీ బడ్స్ ఎయిర్‌ను కూడా లాంఛ్ చేసింది కంపెనీ. రియల్‌మీ బడ్స్ ఎయిర్ ధర రూ.3999. ఫ్లిప్‌కార్ట్‌లో హేట్ టు వెయిట్ సేల్ మొదలైంది. డిసెంబర్ 23న మొదటి సేల్ ఉంటుంది. ఇక దీంతో పాటు రియల్‌మీ యూజర్ ఇంటర్‌ఫేస్‌ని కూడా ప్రకటించింది కంపెనీ. జనవరిలో రియల్‌మీ యూఐ అందుబాటులోకి రానుంది.
రియల్‌మీ ఎక్స్2 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే
ర్యామ్: 4జీబీ, 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్
రియర్ కెమెరా: 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9
సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్
కలర్స్: పెరల్ వైట్, పెరల్ బ్లూ, పెరల్ గ్రీన్
ధర:
4జీబీ+64జీబీ- రూ.16,999
6జీబీ+128జీబీ- రూ.18,999
8జీబీ+128జీబీ- రూ.19,999
Realme X2 Pro: తక్కువ ధరకే రానున్న రియల్‌మీ ఎక్స్2 ప్రో... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Flipkart Year End Sale 2019: భారీ ఆఫర్లతో 'ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019'... డిస్కౌంట్స్ ఇవే
Jio VoWiFi: జియో నుంచి సరికొత్త ఫీచర్... నెట్‌వర్క్ లేకపోయినా కాల్ చేయొచ్చు ఇలా
SBI ATM Card: మీ దగ్గర పాత ఏటీఎం కార్డు ఉంటే డిసెంబర్ 31 లోగా మార్చాల్సిందే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Realme, Smartphone, Smartphones