హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme X50 Pro 5G: ఇండియాలో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ 'రియల్‌మీ ఎక్స్50 ప్రో 5జీ' రిలీజ్

Realme X50 Pro 5G: ఇండియాలో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ 'రియల్‌మీ ఎక్స్50 ప్రో 5జీ' రిలీజ్

Realme X50 Pro 5G: ఇండియాలో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ 'రియల్‌మీ ఎక్స్50 ప్రో 5జీ' రిలీజ్
(image: Realme India)

Realme X50 Pro 5G: ఇండియాలో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ 'రియల్‌మీ ఎక్స్50 ప్రో 5జీ' రిలీజ్ (image: Realme India)

Realme X50 Pro 5G | ప్రస్తుతం టెలికామ్ సెక్టాల్‌లో 4జీ నెట్‌వర్క్ హవా నడుస్తోంది. కోట్లాది మంది దగ్గర 4జీ స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. భారతదేశంలో 5జీ నెట్‌వర్క్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. కానీ అప్పుడే ఇండియాకు తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. రియల్‌మీ ఎక్స్50 ప్రో 5జీ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

  భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ ఇస్తున్న రియల్‌మీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. రియల్‌మీ ఎక్స్50 ప్రో 5జీ పేరుతో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ఇండియాలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం లేకుండా ఈ ఫోన్‌లోనే 5జీ నెట్‌వర్క్ వాడుకోవచ్చు. అయితే ఇండియాలో 5జీ నెట్‌వర్క్ ఎప్పట్లోగా అందుబాటులోకి వస్తుందన్న స్పష్టత లేదు. ఇక రియల్‌మీ ఎక్స్50 ప్రో 5జీ విషయానికి వస్తే... 90 Hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌, 12జీబీ వరకు ర్యామ్ లాంటి ప్రత్యేకతలున్నాయి. అంతేకాదు... 32+8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండటం విశేషం. 4200 ఎంఏహెచ్ బ్యాటరీ 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. రియల్‌మీ ఎక్స్50 ప్రో 5జీ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజీవ్‌గా లభిస్తుంది. 2020 ఫిబ్రవరి 24 సాయంత్రం 6 గంటల నుంచే సేల్ ప్రారంభం కానుంది. ఇక త్వరలో రియల్‌మీ టీవీతో పాటు రియల్‌మీ బ్యాండ్ కూడా తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది కంపెనీ.

  రియల్‌మీ ఎక్స్50 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సాంసంగ్ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే

  ర్యామ్: 6జీబీ, 8జీబీ, 12జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ

  ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865

  రియర్ కెమెరా: 12 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్+64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా+8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ అండ్ మైక్రో లెన్స్+బ్లాక్ అండ్ వైట్ సెన్సార్‌

  ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్+8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్

  బ్యాటరీ: 4200 ఎంఏహెచ్

  ఆపరేటింగ్ సిస్టమ్: రియల్‌మీ యూఐ+ఆండ్రాయిడ్ 10

  కలర్స్: రస్ట్ రెడ్, మాస్ గ్రీన్

  ధర:

  6జీబీ+128జీబీ- రూ.37,999

  8జీబీ+128జీబీ- రూ.39,999

  12జీబీ+256జీబీ- రూ.44,999

  ఇవి కూడా చదవండి:

  Tatkal Train Ticket Booking: గుడ్ న్యూస్... తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్ ఇంకా ఈజీ

  Pan Card: 10 నిమిషాల్లో ఉచితంగా పాన్ కార్డ్... తీసుకోండి ఇలా

  IRCTC: రూ.1,00,000 పెట్టుబడి పెడితే నాలుగు నెలల్లో రూ.5,00,000 లాభం

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: 5G, Realme, Realme UI, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు