Realme 5: మార్కెట్‌లోకి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్ 'రియల్‌మీ 5'... ధర రూ.9999

Realme 5 | రూ.10,000 లోపే 4 కెమెరాలతో స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చి రియల్‌మీ సంచలనం సృష్టించింది. రియల్‌మీ 5 ప్రీ-ఆర్డర్ ఆగస్ట్ 21న ప్రారంభం అవుతుంది.

news18-telugu
Updated: August 20, 2019, 2:27 PM IST
Realme 5: మార్కెట్‌లోకి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్ 'రియల్‌మీ 5'... ధర రూ.9999
Realme 5: మార్కెట్‌లోకి మరో బడ్జెట్‌స్మార్ట్‌ఫోన్ 'రియల్‌మీ 5'... ధర రూ.9999 (image: Realme)
news18-telugu
Updated: August 20, 2019, 2:27 PM IST
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. రియల్‌మీ 5 సిరీస్‌లో భాగంగా రియల్‌మీ 5 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో పాటు 'రియల్‌మీ 5' స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. రూ.10,000 లోపే 4 కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌తో స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చి రియల్‌మీ సంచలనం సృష్టించింది. రియల్‌మీ 5 ప్రోలో ఉన్న డిజైన్‌నే రియల్‌ 5 స్మార్ట్‌ఫోన్‌కు అందిస్తోంది కంపెనీ. రియల్‌మీ 5 సేల్ ఆగస్ట్ 27న ప్రారంభం అవుతుంది. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో రియల్‌మీ 5 లాంఛ్ చేసి షావోమీ, సాంసంగ్, ఏసుస్ లాంటి కంపెనీలకు గట్టిపోటీ ఇస్తోంది రియల్‌మీ.



రియల్‌మీ 5 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.5 అంగుళాలు
ర్యామ్: 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 665
రియర్ కెమెరా: 12 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: కలర్ ఓఎస్ 6
కలర్స్: క్రిస్టల్ బ్లూ, క్రిస్టల్ పర్పుల్
ధర:
3జీబీ+32జీబీ- రూ.9,999
4జీబీ+64జీబీ- రూ.10,999
4జీబీ+128జీబీ- రూ.11,999

Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Paytm: మీ ఫోన్‌లో పేటీఎం యాప్ ఉందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న కంపెనీ

మీ సెల్ఫీలు, ఫోటోలు అద్భుతంగా రావాలా? ఈ స్మార్ట్‌ఫోన్లు ట్రై చేయొచ్చు

WhatsApp Fingerprint: ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ రిలీజ్ చేసిన వాట్సప్... సెట్టింగ్స్ ఇవే
First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...