ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. రియల్మీ 5 సిరీస్‌లో భాగంగా రియల్మీ 5 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో పాటు 'రియల్మీ 5' స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. రూ.10,000 లోపే 4 కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌తో స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చి రియల్మీ సంచలనం సృష్టించింది. రియల్మీ 5 ప్రోలో ఉన్న డిజైన్‌నే రియల్ 5 స్మార్ట్‌ఫోన్‌కు అందిస్తోంది కంపెనీ. రియల్మీ 5 సేల్ ఆగస్ట్ 27న ప్రారంభం అవుతుంది. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో రియల్మీ 5 లాంఛ్ చేసి షావోమీ, సాంసంగ్, ఏసుస్ లాంటి కంపెనీలకు గట్టిపోటీ ఇస్తోంది రియల్మీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.