Realme 3i: మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ రిలీజ్... ధర రూ.7,999

Realme 3i | ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ వెబ్‌సైట్‌లో జూలై 23న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది. ఆగస్ట్‌లో ఆఫ్‌లైన్‌ స్టోర్లకు వస్తాయి.

news18-telugu
Updated: July 15, 2019, 4:18 PM IST
Realme 3i: మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ రిలీజ్... ధర రూ.7,999
Realme 3i: మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ రిలీజ్... ధర రూ.7,999 (image: @realmemobiles/twitter)
  • Share this:
రియల్‌మీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. సోమవారం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ ఎక్స్‌ మోడల్‌తో పాటు రియల్‌మీ 3ఐ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది కంపెనీ. రియల్‌మీ నుంచి 'ఐ' సిరీస్‌లో వచ్చిన తొలి ఫోన్ ఇది. రియల్‌మీ 3ఐ స్పెసిఫికేషన్స్ రియల్‌మీ 3 లాగానే ఉన్నాయి. రియర్ ప్యానెల్ మాత్రం రియల్‌మీ సీ2 లాగా డైమండ్ కట్ డిజైన్, మ్యాట్ ఫినిష్‌తో రావడం విశేషం. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ లాంటి ఫీచర్లున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ వెబ్‌సైట్‌లో జూలై 23న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది. ఆగస్ట్‌లో ఆఫ్‌లైన్‌ స్టోర్లకు వస్తాయి.

రియల్‌మీ 3ఐ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.2 అంగుళాల హెచ్‌డీ+, 1520x720 పిక్సెల్స్, 19:9 యాస్పెక్ట్ రేషియో

ర్యామ్: 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64జీబీ


ప్రాసెసర్: హీలియో పీ60
రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్
Loading...
ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,230 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై+కలర్ ఓఎస్ 6.0
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ నానో సిమ్‌కార్డ్స్, మైక్రో ఎస్‌డీ సపోర్ట్
కలర్స్: డైమండ్ బ్లాక్, డైమండ్ బ్లూ, డైమండ్ రెడ్
ధర:
3జీబీ+32జీబీ- రూ.7,999
4జీబీ+64జీబీ- రూ.9,999

Realme 3i: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

Realme X: రియల్‌మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?

PAN-Aadhar Link: పాన్ కార్డుతో ఆధార్ లింక్ అయిందా? 30 సెకన్లలో తెలుసుకోండి ఇలా

IRCTC e-wallet: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్ ట్రై చేశారా?
First published: July 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...