రియల్‌మీ ఫ్యాన్స్‌కి మాత్రమే కాదు... తక్కువ ధరలో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నవారికి శుభార్త. రియల్‌మీ నుంచి లో బడ్జెట్‌లో రియల్‌మీ సీ3 స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. సీ సిరీస్‌లో రియల్‌మీ నుంచి వచ్చిన మూడో స్మార్ట్‌ఫోన్ ఇది. ఇప్పటికే రియల్‌మీ సీ1, రియల్‌మీ సీ2 మార్కెట్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటికి అప్‌గ్రేడ్ వర్షన్ రియల్‌మీ సీ3 మోడల్‌ను ఆవిష్కరించింది కంపెనీ. 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ రిలీజైంది. ప్రారంభ ధర రూ.6,999. రియల్‌మీ యూఐతో వస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే. రియల్‌మీ సీ3 సేల్ ఫిబ్రవరి 14న ఫ్లిప్‌కార్ట్‌తో రియల్‌మీ వెబ్‌సైట్‌లో ప్రారంభం కానుంది. మొదటి సేల్‌లో ఎక్స్‌ఛేంజ్ ద్వారా ఈ ఫోన్ కొనేవారికి అదనంగా రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఆఫ్‌లైన్ స్టోర్లల్లో ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులో ఉంటుంది.
రియల్‌మీ సీ3 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.5 అంగుళాలహెచ్‌డీ+
ర్యామ్: 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ70
రియర్ కెమెరా: 12+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్+ఎస్‌డీ కార్డ్
కలర్స్: బ్లేజింగ్ రెడ్, ఫ్రోజెన్ బ్లూ
ధర:
3జీబీ+32జీబీ- రూ.6,999
4జీబీ+64జీబీ- రూ.7,999
ఇవి కూడా చదవండి:
WhatsApp Backup: వాట్సప్‌లో మీ డేటా బ్యాకప్ చేయండి ఇలా
Poco X2 vs Realme X2: పోకో ఎక్స్2, రియల్‌మీ ఎక్స్2... ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్
Airtel Plans 2020: ఎయిర్‌టెల్‌లో ఈ ప్లాన్స్‌తో ఇన్స్యూరెన్స్ ఫ్రీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Android 10, Realme, Realme UI, Smartphone, Smartphones