Home /News /technology /

Realme Q3t: పాపులర్ ప్రాసెసర్‌తో రిలీజ్ అయిన రియల్‌మీ క్యూ3టీ స్మార్ట్‌ఫోన్

Realme Q3t: పాపులర్ ప్రాసెసర్‌తో రిలీజ్ అయిన రియల్‌మీ క్యూ3టీ స్మార్ట్‌ఫోన్

Realme Q3t: పాపులర్ ప్రాసెసర్‌తో రిలీజ్ అయిన రియల్‌మీ క్యూ3టీ స్మార్ట్‌ఫోన్

Realme Q3t: పాపులర్ ప్రాసెసర్‌తో రిలీజ్ అయిన రియల్‌మీ క్యూ3టీ స్మార్ట్‌ఫోన్

Realme Q3t | ఇటీవల బాగా పాపులర్ అయిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో రియల్‌మీ క్యూ3టీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

    చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ అయిన రియల్‌మీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. చైనాలో రియల్‌మీ క్యూ3టీ (Realme Q3t) స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇటీవల బాగా పాపులర్ అయిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెర్ ఉండటం విశేషం. ఇప్పటికే ఈ ప్రాసెసర్‌తో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ (Samsung Galaxy M52 5G), రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ (Realme GT Master Edition), ఐకూ జెడ్5 5జీ (iQOO Z5 5G), షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ (Xiaomi 11 Lite NE 5G), మోటోరోలా ఎడ్జ్ 20 (Motorola Edge 20) లాంటి మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే ప్రాసెసర్‌తో చైనా మార్కెట్‌లో రియల్‌మీ క్యూ3టీ రిలీజ్ అయింది.

    WhatsApp Tricks: వాట్సప్‌లో ఎవరైనా విసిగిస్తున్నారా? వాళ్లకు తెలియకుండా ఇలా చేయండి

    రియల్‌మీ క్యూ సిరీస్‌లో కొద్ది రోజుల క్రితం రియల్‌మీ క్యూ3ఎస్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రియల్‌మీ క్యూ3టీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ మొబైల్ కేవలం ఒకే వేరియంట్‌లో రిలీజ్ అయింది. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్‌లో ఈ మొబైల్‌ను రిలీజ్ చేసింది రియల్‌మీ. ధర సుమారు రూ.25,000 ఉంటుంది. రియల్‌మీ చైనా వెబ్‌సైట్‌లో ఈ రియల్‌మీ క్యూ3టీ స్మార్ట్‌ఫోన్ సేల్ కూడా మొదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న స్పష్టత లేదు.

    WhatsApp: ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా నాలుగు డివైజ్‌లలో వాట్సప్ వాడుకోవచ్చు ఇలా

    రియల్‌మీ క్యూ3టీ స్మార్ట్‌ఫోన్‌లో డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 144Hz రిఫ్రెష్ రేట్‌తో ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెర్‌తో పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో రిలీజ్ అయింది. డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో 5జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

    రియల్‌మీ క్యూ3టీ స్మార్ట్‌ఫోన్‌లో 48మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా + 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 25 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. రియల్‌మీ క్యూ3టీ స్మార్ట్‌ఫోన్‌ను నెబ్యులా, నైట్ స్కై బ్లూ కలర్స్‌లో కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Realme, Realme UI, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు