REALME PLANS TO MANUFACTURE LAPTOPS TABLETS LOCALLY IN NOIDA BY 2023 HERE DETAILS NS GH
Realme: వ్యాపార విస్తరణపై రియల్మీ దృష్టి.. 2023 నాటికి నోయిడాలో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ల ఉత్పత్తి.. వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
ఇండియాలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు చైనా దిగ్గజ సంస్థ రియల్మీ చర్యలు తీసుకుంటోంది. పూర్తిగా అన్ని ప్రొడక్టులను ఇండియాలో తయారు చేయాలనే యోచనతో అడుగులు వేస్తోంది. గ్రేటర్ నోయిడాలో ఉన్న పరిశ్రమను విస్తరించాలని భావిస్తోంది.
ఇండియాలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు చైనా దిగ్గజ సంస్థ రియల్మీ చర్యలు తీసుకుంటోంది. పూర్తిగా అన్ని ప్రొడక్టులను ఇండియాలో తయారు చేయాలనే యోచనతో అడుగులు వేస్తోంది. గ్రేటర్ నోయిడాలో ఉన్న పరిశ్రమను విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే KHY ఎలక్ట్రానిక్స్ సహకారంతో స్థానికంగా స్మార్ట్ వాచ్‌లు, ఆడియో ప్రొడక్టులను రియల్మీ కంపెనీ తయారు చేస్తోంది. గ్రేటర్ నోయిడాలో రియల్మీ తమ ప్రొడక్టులను తయారు చేస్తోంది. ET నివేదిక ప్రకారం.. 2023 నాటికి నోయిడాలోని పరిశ్రమలోనే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ల తయారీని ప్రారంభించాలనే యోచనలో రియల్మీ ఉంది. రియల్మీ తన మొత్తం ప్రొడక్టుల తయారీని ఇండియాలోనే చేయాలని అనుకుంటున్నట్లు కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పినట్లు ఈటీ నివేదికలో స్పష్టం చేసింది. కంపెనీ అనేక ఇతర ఇండియన్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్లతో చర్చలు జరుపుతోంది.
నోయిడాలో రియల్మీ ల్యాప్‌టాప్, టాబ్లెట్ల తయారీ
రియల్మీ ఇప్పటికే “ముగ్గురు” సంభావ్య భాగస్వాములతో ల్యాప్‌టాప్, టాబ్లెట్ల తయారీపై చర్చించడం ప్రారంభించినట్లు ET తమ నివేదికలో పేర్కొంది. KHY ఎలక్ట్రానిక్స్‌తో కేవలం ఒక ప్రొడక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ కోసమే కంపెనీ రూ.26.7 కోట్ల పెట్టుబడి పెట్టిందని రియల్మీ సీఈవో మాధవ్ సేత్ వెల్లడించారు. 2022 ముగిసేలోపు రియల్మీ 6-8 ప్రొడక్టులను కేటగిరీలోకి తీసుకువస్తుందని షెత్ తెలిపారు. ఈ ప్రొడక్టులన్నీ భారతదేశంలోనే తయారు చేస్తామని, తదునుగుణంగా ఎంత పెట్టుబడి అవసరమనేది పరిశీలిస్తామని చెప్పారు.
చైనీస్ టెక్ దిగ్గజం రియల్మీ ఏడాది చివరి నాటికి 300,000 యూనిట్ల ఆడియో ప్రొడక్టులను స్థానికంగా తయారు చేయాలని యోచిస్తోంది. ఇది భారతదేశంలో దాదాపు 100కు పైగా ఉద్యోగాలను సృష్టిస్తుంది. సరసమైన ధరలకు ఈ ఆడియో ప్రొడక్టులను అందిస్తుండటంతో ఈ విభాగంలో వృద్ధిని సాధిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
దేశంలో 5జీ నెట్వర్క్ వేలానికి సంబంధించి రియల్మీ కంపెనీ సీఈఓ కూడా ఓ వ్యాఖ్య చేశారు. ఇది స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు “సానుకూల” ప్రతి స్పందన అని చెప్పారు. ఈ వేలం పూర్తయిన తర్వాత మార్కెట్లోకి 5జీ నెట్వర్క్కి సపోర్ట్ చేసే ఫోన్లను వీలైనంత తక్కువ ధరకు ఇచ్చేందుకు ఆయా మొబైల్ తయారీ సంస్థలు పోటీపడతాయని సీఈవో మాధవ్ సేత్ వివరించారు.
కొన్ని వారాల క్రితం.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రియల్మీ తన మొట్టమొదటి గ్లోబల్ ఫ్లాగ్షిప్ స్టోర్‌ను ఆవిష్కరించింది. ఫ్లాగ్షిప్ స్టోర్లలో వేరబుల్స్, ఆడియో ప్రొడక్టులు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ కేర్ ఉత్పత్తులు, స్మార్ట్ హోమ్ డివైజ్లతో సహా కంపెనీ ఉత్పత్తులను ప్రదర్శించే ప్రత్యేకమైన టెక్లైఫ్ జోన్ ఉంటుంది. సందర్శకులు కూర్చుని విశ్రాంతి తీసుకోవడానికి, స్నాక్స్, కాఫీలు తీసుకోవడానికి ఒక కేఫ్ కూడా ఉంది. మూడ రకాల థీమ్‌తో స్టోర్‌ను తీర్చిదిద్దారు. వినియోగదారులను ఈ రియల్మీ స్టోర్ ఆకట్టుకుంటోంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.