Realme PaySa: మంచి ఐడియా చెప్తే రూ.10,00,000 మీవే

Realme PaySa UPI hackathon | ఏప్రిల్ 5 లోపు డీటెయిల్డ్ సొల్యూషన్ వివరించాలి. మే 11న ముంబైలో జరిగే కార్యక్రమంలో ప్రోటోటైప్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: February 25, 2020, 5:28 PM IST
Realme PaySa: మంచి ఐడియా చెప్తే రూ.10,00,000 మీవే
Realme PaySa: మంచి ఐడియా చెప్తే రూ.10,00,000 మీవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న రియల్‌మీ కొద్ది రోజుల క్రియం డిజిటల్ పేమెంట్ సర్వీస్ 'రియల్‌మీ పేసా' ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'రియల్‌మీ పేసా' నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో కలిసి ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. యూపీఐ పేమెంట్ విధానంలో వినూత్నమైన, సులభతరమైన పద్ధతుల్ని కనుగొనడమే ఈ కాంటెస్ట్. 'రియల్‌మీ పేసా'కు డివైజ్ యూపీఐ సొల్యూషన్ చూపించినవారికి రూ.10 లక్షల బహుమతి ప్రకటించింది. ఈ కాంటెస్ట్ ఫిబ్రవరి 10న ప్రారంభమైంది. మార్చి 10 వరకు కొనసాగుతుంది. ఆసక్తిగల వారు మార్చి 10 లోగా తమ ఐడియాను రిజిస్టర్ చేయాలి. ఏప్రిల్ 5 లోపు డీటెయిల్డ్ సొల్యూషన్ వివరించాలి. మే 11న ముంబైలో జరిగే కార్యక్రమంలో ప్రోటోటైప్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.


ఈ కాంపిటీషన్ రెండు దశల్లో జరుగుతుంది. చివరి రౌండ్‌కు ఐదుగురిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఆంట్రప్రెన్యూర్స్, విద్యార్థులు, పలు కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, టెకీస్, కోడర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. విజేతకు రూ.10,00,000, రన్నర్‌కు రూ.5,00,000 బహుమతి అందిస్తారు. 'రియల్‌మీ పేసా' భారతదేశంలో పేటీఎం మనీ, గూగుల్ పే, ఎంఐ క్రెడిట్ లాంటి సంస్థలకు పోటీగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. 'రియల్‌మీ పేసా' యాప్ ద్వారా రూ.8,000 నుంచి రూ.1,00,000 వరకు పర్సనల్ లోన్, రూ.50,000 నుంచి రూ.50 లక్షల వరకు బిజినెస్ లోన్ తీసుకోవచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్‌తో పాటు బిల్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. యూజర్లు తమ క్రెడిట్ స్కోర్‌ కూడా తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:Gold Discount: బంగారంపై రూ.6,000 డిస్కౌంట్... కొనండి ఇలా

Realme X50 Pro 5G: తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ 'రియల్‌మీ ఎక్స్50 ప్రో 5జీ' ఎలా ఉందో చూడండి

Redmi Note 8 Pro: గుడ్ న్యూస్... రెడ్‌మీ నోట్ 8 ప్రో ధర తగ్గింది
Published by: Santhosh Kumar S
First published: February 25, 2020, 5:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading