REALME PAD X LAUNCHED IN CHINA AND COMES WITH A QUALCOMM SNAPDRAGON 695 CHIPSET A 2K DISPLAY AND MORE KNOW PRICE FEATURES SPECIFICATIONS GH SRD
Realme Pad X: రియల్‌మీ నుంచి సరికొత్త ట్యాబ్ లాంచ్.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలివే..
Realme Pad X
Realme Pad X: రియల్‌మీ ప్యాడ్ X డివైజ్ 2K రిజల్యూషన్‌తో 11 అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఇది 6GB వరకు RAMతో పెయిర్ అయిన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
స్మార్ట్‌ఫోన్‌తయారీ సంస్థ రియల్‌మీ ట్యాబ్లెట్లను కూడా రిలీజ్ చేస్తోంది. ఈ కంపెనీ సరికొత్త ట్యాబ్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ డివైజ్ పేరు రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ (Realme Pad X). ఇది ఒక ఆండ్రాయిడ్ టాబ్లెట్. దీంట్లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్, 2K డిస్‌ప్లే, ఇతర ఫీచర్లు ఉన్నాయి. అయితే ఈ ట్యాబ్ ప్రస్తుతం చైనాలో మాత్రమే లాంచ్ అయింది. గ్లోబల్ మార్కెట్‌లో దీని లాంచింగ్‌పై కంపెనీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
* రియల్‌మీ ప్యాడ్ X ధర, లభ్యత
రియల్‌మీ ప్యాడ్ X బేస్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,299గా ఉంది. మన కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ. 15,000వరకు ఉంటుంది. ఇది ప్రారంభ ధర మాత్రమే. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,599 (దాదాపు రూ. 18,400). చైనాలో రియల్‌మీ ప్యాడ్ X ట్యాబ్ సేల్స్ జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి.
చైనాలో ఈ టాబ్లెట్‌ను ప్రీ-ఆర్డర్ చేసే వారికి CNY 99 (దాదాపు రూ. 1,200) ధర ఉండే రియల్‌మీ ట్యాబ్లెట్ ఎక్స్ స్మార్ట్ కవర్ కూడా లభిస్తుంది. గ్రీన్ చెస్‌బోర్డ్, సీ సాల్ట్ బ్లూ, స్టార్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో ఈ టాబ్లెట్ లాంచ్ అయింది. రియల్‌మీ ప్యాడ్ X డివైజ్ ఇండియా, ఇతర మార్కెట్లలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే వివరాలపై స్పష్టత లేదు.
రియల్‌మీ ప్యాడ్ X డివైజ్ 2K రిజల్యూషన్‌తో 11 అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఇది 6GB వరకు RAMతో పెయిర్ అయిన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. RAM ఎక్స్‌పాన్షన్ టెక్నాలజీతో ట్యాబ్లెట్ ర్యామ్ కెపాసిటీని 11GB వరకు పొడిగించుకోవచ్చు. రియల్‌మీ ప్యాడ్ Xలో 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ఈ స్టోరేజ్‌ను 512GB వరకు పొడిగించుకోచ్చు.
రియల్‌మీ ప్యాడ్ X డివైజ్‌లో ఒకే 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంటుంది. వీడియో కాల్స్ కోసం అల్ట్రా-వైడ్ ఫ్రంట్ షూటర్‌ను కంపెనీ అందించింది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 8,430mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండే క్వాడ్ స్పీకర్స్ ఉంటాయి. ఇవి బెస్ట్ సౌండ్ క్వాలిటీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయని కంపెనీ పేర్కొంది. అయితే ఇండియాలో దీని లాంచింగ్‌కు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.