హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme Pad X 5G: రియల్‌మీ నుంచి 5జీ ట్యాబ్లెట్... స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 8340mAh బ్యాటరీ, మరెన్నో ఫీచర్స్

Realme Pad X 5G: రియల్‌మీ నుంచి 5జీ ట్యాబ్లెట్... స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 8340mAh బ్యాటరీ, మరెన్నో ఫీచర్స్

Realme Pad X 5G: రియల్‌మీ నుంచి 5జీ ట్యాబ్లెట్... స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 8340mAh బ్యాటరీ, మరెన్నో ఫీచర్స్
(image: Realme India)

Realme Pad X 5G: రియల్‌మీ నుంచి 5జీ ట్యాబ్లెట్... స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 8340mAh బ్యాటరీ, మరెన్నో ఫీచర్స్ (image: Realme India)

Realme Pad X 5G | రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ 5జీ ట్యాబ్లెట్ ఇండియాలో రిలీజైంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 8340mAh బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రియల్‌మీ ట్యాబ్‌తో (Realme Tab) పాటు పెన్సిల్, కీబోర్డ్ కూడా రిలీజ్ చేసింది కంపెనీ.

ఇంకా చదవండి ...

రియల్‌మీ ఇండియా నుంచి మరో ట్యాబ్లెట్ వచ్చేసింది. రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ (Realme Pad X) ట్యాబ్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. ఇది ఇండియాలో రియల్‌మీ రిలీజ్ చేసిన మూడో ట్యాబ్లెట్. ఇది 5జీ ట్యాబ్లెట్. ఇందులో స్మార్ట్‌ఫోన్లలో పాపులర్ అయిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ (Snapdragon 695), 8340mAh బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ ట్యాబ్లెట్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వైఫై వేరియంట్ ట్యాబ్లెట్ ధర రూ.19,999. ఇక 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వైఫై వేరియంట్ ధర రూ.25,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వైఫై వేరియంట్ ధర రూ.27,999.

రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ ఆఫర్స్


రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ సేల్ ఆగస్ట్ 1న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ అఫీషియల్ సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్‌తో రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ 4జీబీ+64జీబీ వైఫై వేరియంట్‌ను రూ.17,999 ధరకు, 4జీబీ+64జీబీ సిమ్ వేరియంట్‌ను రూ.23,999 ధరకు, 6జీబీ+128జీబీ సిమ్ వేరియంట్‌ను రూ.25,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. గ్లేసియర్ బ్లూ, గ్లోయింగ్ గ్రే కలర్స్‌లో కొనొచ్చు.

Smartphone Sale: రూ.20 వేల లోపు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్... ఇంకొన్ని గంటలే ఆఫర్

రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ స్పెసిఫికేషన్స్

రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 10.95 అంగుళాల WUXGA+ ఫుల్ వ్యూ డిస్‌ప్లే ఉంది. లో బ్లూలైట్ ఐ ప్రొటెక్షన్ ఫీచర్ ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 8340ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 33వాట్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

ICICI Monsoon Bonanza: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్... స్మార్ట్‌ఫోన్లపై రూ.7,500 వరకు డిస్కౌంట్

రియల్‌మీ పెన్సిల్‌తో ఈ ట్యాబ్లెట్ ఆపరేట్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ 12 + రియల్‌మీ యూఐ 3.0 ఫర్ ప్యాడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మెమొరీ కార్డుతో 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇందులో 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉండగా, సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్స్, స్టీరియో స్క్వాడ్ స్పీకర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ ట్యాబ్లెట్‌తో పాటు మరిన్ని ప్రొడక్ట్స్ లాంఛ్ అయ్యాయి. రియల్‌మీ పెన్సిల్, రియల్‌మీ స్మార్ట్ కీబోర్డ్ కూడా లాంఛ్ అయ్యాయి. రియల్‌మీ పెన్సిల్ ధర రూ.5,499 కాగా, రియల్‌మీ స్మార్ట్ కీబోర్డ్ ధర రూ.4,999. రియల్‌మీ నుంచి తొలిసారి మానిటర్ రిలీజ్ అయింది. ధర రూ.12,999. జూలై 29న సేల్ ప్రారంభం అవుతుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Realme, Smartphone, Tablet

ఉత్తమ కథలు