మీరు రియల్మీ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? అయితే మీకు శుభవార్త. రియల్మీ యూజర్ ఇంటర్ఫేస్-UI వచ్చేస్తోంది. కొద్దిరోజుల క్రితమే ఆండ్రాయిడ్ 10 బేస్డ్ రియల్మీ యూఐ ప్రకటించింది కంపెనీ. ఇప్పటివరకు రియల్మీ ఫోన్లన్నీ కలర్ ఓఎస్‌తో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కలర్ ఓఎస్ నచ్చనివాళ్లు రియల్మీ ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపట్లేదని కంపెనీ గుర్తించింది. అందుకే సొంతగా యూఐ రూపొందించింది రియల్మీ. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా రియల్మీ యూఐ రూపొందించినట్టు కంపెనీ చెబుతోంది. ఐకాన్స్ కస్టమైజేషన్, ప్రకృతిని తలపించే వాల్ పేపర్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ ఫీచర్ లాంటి ప్రత్యేకతలు రియల్మీ యూఐలో ఉంటాయి. మామూలుగా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి మూడు వేళ్లతో స్క్రీన్‌పైన స్వైప్ చేయడం అలవాటు. కానీ... రియల్మీ యూఐలో జస్ట్ మూడు వేళ్లతో హోల్డ్ చేస్తే చాలు... స్క్రీన్‌షాట్ వచ్చేస్తుంది. ఇక మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిన కాల్ హిస్టరీ, కాంటాక్ట్స్, మెసేజెస్‌కు ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. ఇప్పటికే కొన్ని ఫోన్లకు రియల్మీ యూఐ రిలీజ్ అయింది. మరి ఎప్పుడెప్పుడు ఏఏ ఫోన్లకు రియల్మీ యూఐ అప్డేట్ వస్తుందో తెలుసుకోండి.

Source: Realme India
2020 జనవరి- రియల్మీ 3 ప్రో, రియల్మీ ఎక్స్‌టీ
2020 ఫిబ్రవరి- రియల్మీ ఎక్స్, రియల్మీ 5 ప్రో
2020 మార్చి- రియల్మీ ఎక్స్2, రియల్మీ ఎక్స్2 ప్రో
2020 ఏప్రిల్- రియల్మీ 3, రియల్మీ 3ఐ
2020 మే- రియల్మీ 5, రియల్మీ 5ఎస్
2020 జూన్- రియల్మీ 2 ప్రో
2020 జూలై నుంచి సెప్టెంబర్ మధ్య- రియల్మీ సీ2
స్మార్ట్‌ఫోన్‌తో అదిరిపోయేలా ఫోటోషూట్...రియల్మీ ఎక్స్2 ప్రో అద్భుతం
ఇవి కూడా చదవండి:
మీ పేటీఎం, ఫోన్ పేలో డబ్బులు సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి
Aadhaar card: ఆధార్ కార్డులో అడ్రస్ మార్చాలా? ఆన్లైన్లో చేయండి ఇలా
IRCTC: రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత టికెట్లు బుక్ చేయొచ్చు ఇలాPublished by:Santhosh Kumar S
First published:January 13, 2020, 19:16 pm