రియల్‌మీ ఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ ఎక్స్2 ప్రో ఇండియాలో రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొద్ది రోజుల క్రితమే చైనాలో రిలీజైంది. దీంతో స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ గురించి అందరికీ తెలుసు. స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్, 50w SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64 మెగాపిక్సెల్ కెమెరా, సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే లాంటి ప్రత్యేకతలు ఉండటంతో ఈ ఫోన్‌పై ఆసక్తి పెరిగింది. ధర ఎంత ఉంటుందా అని యూజర్లు ఆసక్తిగా ఎదురుచూశారు. మొత్తానికి ఇండియాలో రియల్‌మీ ఎక్స్2 ప్రో గ్రాండ్‌గా రిలీజైంది. ప్రారంభ ధర రూ.రూ.29,999. నవంబర్ 26 మధ్యాహ్నం 12 గంటల నుంది నవంబర్ 27 అర్థరాత్రి వరకు సేల్ ఉంటుంది. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్స్ చాలానే ఉన్నాయి. షావోమీ, సాంసంగ్, ఒప్పో, వివో లాంటి కంపెనీలు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్ గతంలోనే రిలీజ్ చేశాయి. ఇప్పుడు ఈ ఫోన్లకు రియల్‌మీ ఎక్స్2 ప్రో పోటీ ఇవ్వనుంది.
రియల్‌మీ ఎక్స్2 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+
ర్యామ్: 8జీబీ, 12జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855+
రియర్ కెమెరా: 64+13+8+మ్యాక్రో లెన్స్
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
కలర్స్: నెప్‌ట్యూన్ బ్లూ, లూనార్ వైట్
ధర:
8జీబీ+128జీబీ- రూ.29,999
12జీబీ+256జీబీ- రూ.33,999
12జీబీ+256జీబీ (మాస్టర్ ఎడిషన్)- రూ.34,999
అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
SBI FASTag: డిసెంబర్ 1 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి... ఎస్‌బీఐలో కొనండి ఇలా
SBI: ఏటీఎం పనిచేయట్లేదా? కిరాణా షాప్‌లో డబ్బులు తీసుకోవచ్చు ఇలా
IRCTC Rail Connect App: ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ మారింది... కొత్త ఫీచర్స్ ఇవే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Realme, Smartphone, Smartphones